Begin typing your search above and press return to search.

తమిళంలో టాప్ తెలుగు సినిమాలు.. పుష్ప 2 ఎంత తెస్తుందో?

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ‘పుష్ప 2’ కోసం ప్రముఖ డిస్టిబ్యూటర్ ఏకంగా 50 కోట్లు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   26 Oct 2024 5:14 AM GMT
తమిళంలో టాప్ తెలుగు సినిమాలు.. పుష్ప 2 ఎంత తెస్తుందో?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’ డిసెంబర్ 5న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సినిమాపై బన్నీ అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. మేకర్స్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కచ్చితంగా ఈ చిత్రం 1000+ కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకుంటుందని భావిస్తున్నారు. ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి మొత్తం నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారానే వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఓటీటీ రైట్స్ ఏకంగా 270 కోట్లకి అమ్ముడయినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాపై అన్ని ఏరియాలలో సాలిడ్ గా బిజినెస్ జరిగింది. తమిళనాడులో ఈ సినిమా రైట్స్ 50 కోట్లకి వెళ్లాయి. కోలీవుడ్ లో 50 కోట్లు అంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. అయితే ‘పుష్ప’ సినిమాకి తమిళనాట 30 కోట్లు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ‘పుష్ప 2’ కోసం ప్రముఖ డిస్టిబ్యూటర్ ఏకంగా 50 కోట్లు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా తమిళనాడులో ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందనే దానిపైన ఎవరి అంచనాలు వారికున్నాయి.

తమిళ్ నేటివిటీకి దగ్గరగా ఉండే కథాంశంతోనే ‘పుష్ప 2’ ఉండబోతోంది. ఈ నేపథ్యంలో కచ్చితంగా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టడం గ్యారెంటీ అని అందరూ భావిస్తున్నారు. తమిళనాడులో అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న తెలుగు సినిమాల జాబితా చూసుకుంటే టాప్ లో ‘బాహుబలి 2’ మూవీ ఉంది. ఈ చిత్రం 153 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ 80 కోట్లు వసూళ్లు చేసి రెండో స్థానంలో నిలిచింది. ‘బాహుబలి’ మూవీ 75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో టాప్ 3లో ఉంది.

దీని తర్వాత ‘కల్కి 2898ఏడీ’ మూవీ 45.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో టాప్ 4లోకి వచ్చింది. ‘పుష్ప’ మూవీ 30 కోట్ల తో టాప్ 5 హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా ఉంది. ‘ఊపిరి’ మూవీ 27.2 కోట్ల గ్రాస్ తో ఆరోస్థానంలో ‘స్పైడర్’ 25 కోట్లతో ఏడో స్థానంలో ఉన్నాయి. ‘సలార్’ మూవీ 24.6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని టాప్ 8గా ఉంది. 9, 10 స్థానాలలో ఈగ, అరుంధతి సినిమాలు నిలిచాయి. ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం తమిళనాడులో 10.7 కోట్ల గ్రాస్ మాత్రమే వసూళ్లు చేసింది.

విజయ్ దేవరకొండ, సమంత జోడీగా వచ్చిన ‘ఖుషి’ మూవీ తమిళనాడులో కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా లాంగ్ రన్ లో 10.8 కోట్లు వసూళ్లు చేసింది. ‘పుష్ప 2’ మూవీ అయితే కచ్చితంగా టాప్ 5 సినిమాల జాబితాలోకి వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. కానీ ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తమిళంలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న తెలుగు సినిమాలు

బాహుబలి 2 - 153 కోట్లు

ఆర్ఆర్ఆర్ - 80 కోట్లు

బాహుబలి - 75 కోట్లు

కల్కి 2898ఏడీ - 45.2 కోట్లు

పుష్ప - 30 కోట్లు

ఊపిరి - 27.2 కోట్లు

స్పైడర్ - 25 కోట్లు

సలార్ - 24.6 కోట్లు

ఈగ - 24.5 కోట్లు

అరుంధతి - 14 కోట్లు

సాహో - 12.2 కోట్లు

ఖుషి - 10.8 కోట్లు

దేవర - 10.7 కోట్లు

సీతారామం - 10.4 కోట్లు

రుద్రమదేవి - 9.8 కోట్లు

భాగమతి - 9.8 కోట్లు