AR రెహమాన్‌కి ప్రపోజ్ చేసిన టాప్ హీరోయిన్స్!
అతడు వ్యక్తిగత జీవితంపై కొన్ని ప్రశ్నలను ఎదుర్కొన్నాడు. పాపులర్ పోర్టల్‌తో చాటింగ్ సెషన్‌లో రెహమాన్ తన వ్యక్తిగత జీవితం గురించి స్పష్టంగా ఓపెనయ్యాడు.
By: Tupaki Desk | 17 Aug 2023 11:30 PM GMTనేటితరం యువసంగీత దర్శకుడు అనిరుధ్ అందాల కథానాయికలతో ప్రేమాయణాలు సాగిస్తూ నిరంతరం హాట్ టాపిక్ అవుతున్నాడు. ఇంతకుముందు లైవ్ వైర్ దేవీశ్రీ మీద ఇలాంటి ఫిర్యాదులు అందాయి. పలువురు యువసంగీత దర్శకులు గాయనీమనులతో ప్రేమలో పడి వారిని పెళ్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ తనవైన సుస్వరాలతో ఉర్రూతలూగించిన ఏ.ఆర్.రెహమాన్ కి కథానాయికలు కానీ గాయనీమణులు కానీ డేటింగ్ లేదా పెళ్లి ప్రపోజల్స్ చేయలేదా?
స్వరమాంత్రికుడు AR రెహమాన్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అసాధారణ ఫాలోయింగ్ దృష్ట్యా ఇలాంటి సందేహాలు రావడం సహజమే. కానీ అతడు ఇతరులతో పోలిస్తే ఎంతో మృధుస్వభావి. దూకుడును అస్సలు ప్రదర్శించడు. లో-ప్రొఫైల్‌ను మెయింటెయిన్ చేసే వ్యక్తి! అని కూడా ఇండస్ట్రీ సన్నిహితులు మిత్రులు చెబుతుంటారు. అయితే ఇటీవలి కాలంలో మీడియాతో ఇంటరాక్షన్ లో అతడు వ్యక్తిగత జీవితంపై కొన్ని ప్రశ్నలను ఎదుర్కొన్నాడు. పాపులర్ పోర్టల్‌తో చాటింగ్ సెషన్‌లో రెహమాన్ తన వ్యక్తిగత జీవితం గురించి స్పష్టంగా ఓపెనయ్యాడు. ప్రారంభ జీవితంలో తాను డేటింగ్‌కు దూరంగా ఉన్నానని.. దానికి బదులుగా వివాహం చేసుకున్నానని తెలిపాడు. భార్య సైరా బానుతో AR రెహమాన్ పెళ్లికి సంబంధించిన ఫోటోను ప్రదర్శించి దాని గురించి మాట్లాడమని హోస్ట్ ప్రశ్నించగా.. "1994 అని అనుకుంటున్నాను... చాలా మంది హీరోయిన్లు ప్రపోజ్ చేసారు. నేను అప్పుడే మా అమ్మకి చెప్పి నాకు తగిన అమ్మాయిని కనిపెట్టమని అడిగాను" అని రెహమాన్ వెల్లడించారు.
మీరు మంచి అబ్బాయి తరహానా? అని యాంకర్ ప్రశ్నించగా.. "అలా కాదు.. ఎవరితోనూ గడిపేంత సమయం లేదు.. నేను బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశాను. నేను ఒక వేళ అలాంటి పనుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే సంగీతానికి ఏమీ చేయలేకపోయేవాడిని. అప్పట్లో చాలా సినిమాలు చేసాను. ప్రత్యేకించి దాని(డేటింగ్)తో వచ్చే 'మానసిక హింస'కు దూరంగా ఉన్నాను" అని నవ్వేస్తూ తెలిపాడు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. AR రెహమాన్ ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నాడు. లెజెండరీ నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో మణిరత్నంతో భారీ చిత్రమిది. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తారని సమాచారం. దర్శకుడు మారి సెల్వరాజ్ 'మామన్నన్' కి రెహమాన్ ఇచ్చిన నేపథ్య సంగీతం పాటలు ప్రజల్ని గొప్పగా అలరించాయి. ఇవే కాకుండా మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.