Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: ఈ హీరోలంతా ఏమ‌య్యారు?

కాలంతో పాటే మ‌ర‌పు. ఇంత‌కుముందు హీరోలుగా ఓ వెలుగు వెలిగిన వారిని ఇప్పుడు కాలంతో పాటు ప్ర‌జ‌లు మ‌ర్చిపోతున్నారు

By:  Tupaki Desk   |   19 Aug 2023 5:07 AM GMT
టాప్ స్టోరి: ఈ హీరోలంతా ఏమ‌య్యారు?
X

కాలంతో పాటే మ‌ర‌పు. ఇంత‌కుముందు హీరోలుగా ఓ వెలుగు వెలిగిన వారిని ఇప్పుడు కాలంతో పాటు ప్ర‌జ‌లు మ‌ర్చిపోతున్నారు. నిజానికి టాలీవుడ్ లో ఉవ్వెత్తున ఎగ‌సిప‌డే కెర‌టంలా రంగ ప్ర‌వేశం చేసాడు వ‌రుణ్ సందేశ్. కానీ కాల‌క్ర‌మంలో అత‌డి స్టార్ డ‌మ్ వెల‌వెల‌బోయింది. హ్యాపీడేస్- కొత్త బంగారు లోకం స‌హా ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించిన వ‌రుణ్ తేజ్ ద‌శాబ్ధం పాటు హీరోగా వెలిగాడు. కానీ ఆ త‌ర్వాత అతడికి వరుస ఫ్లాపులు రావ‌డంతో పూర్తిగా తెర‌మ‌రుగ‌య్యాడు. ఇటీవ‌ల కంబ్యాక్ కోసం ప్ర‌య‌త్నించినా ఆశించిన స‌క్సెస్ ద‌క్క‌లేదు. వ‌రుణ్ తేజ్ తో పాటు 'హ్యాపీడేస్'లో న‌టించిన‌ రాహుల్ ఆ త‌ర్వాత హీరోగా ట్రై చేసినా కానీ స‌క్సెస్ క‌లిసి రాలేదు. అదృష్టం వెన్ను చూప‌డంతో వెనుదిరిగాడు. ఇక ఇదే చిత్రంలో మెయిన్ లీడ్ చేసిన నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్ ని నిర్మించుకున్న తీరు ప‌రిశ్ర‌మ‌లో ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తోంది.

ఇక‌పోతే బాలీవుడ్ లోనూ కెర‌టంలా దూసుకొచ్చి ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో చ‌ప్పున చ‌ల్లారిపోయిన న‌ట‌వార‌సులు ఉన్నారు. అమీర్ ఖాన్ మేన‌ల్లుడు ఇమ్రాన్ ఖాన్ 'జానే తూయా జానేనా' చిత్రంతో ఘ‌న‌మైన ఎంట్రీ ఇచ్చాడు. ఆరంభ‌మే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని యూత్ ఫేవ‌రెట్ స్టార్ అయ్యాడు. ప్ర‌తి యువ‌కుడు తాను కూడా ఇలా ఉండాలి అనుకునేంత‌గా ఫాలోయింగ్ సంపాదించాడు.

యువ‌తుల‌కు ఆరాధ్య హీరో అయ్యాడు. అతని తదుపరి రెండు చిత్రాల వైఫల్యం తర్వాత ఇమ్రాన్ ఖాన్‌ను మీడియా వ‌న్ ఫిలింవండ‌ర్ అని కామెంట్ చేసింది. ఐ హేట్ లవ్ స్టోరీస్ (2010), ఢిల్లీ బెల్లీ (2011), మేరే బ్రదర్ కి దుల్హన్ (2011), ఏక్ మైన్ ఔర్ ఏక్ తు (2012) వంటి వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాలలోను అతను నటించాడు. ఆ తర్వాత వరుసగా బాక్సాఫీస్ ఫ్లాప్‌లు రావ‌డం వ్య‌క్తిగ‌త (ఫ్యామిలీ) లైఫ్ లో ఇబ్బందులు తలెత్త‌డంతో ఇమ్రాన్ చాలా కాలంగా తెర‌కు దూరంగా ఉన్నాడు.

హృతిక్ రోష‌న్ పోలిక‌ల‌తో ఉన్న‌ హ‌ర్మాన్ భ‌వేజా ఘ‌న‌మైన ఎంట్రీ ఇచ్చాడు. శిక్కుల కుటుంబం నుంచి వ‌చ్చిన అత‌డు ల‌వ్ స్టోరి 2050 అనే చిత్రంతో తెర‌కు ప‌రిచ‌యం అయ్యాడు. అయితే భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద డిజాస్ట‌ర్ అయింది. వాట్స్ యువర్ రాశీ (2009), విక్టరీ (2009), డిష్కియావూన్ (2014), ఇట్స్ మై లైఫ్ (2020) చిత్రాల్లో న‌టించాడు. నెట్‌ఫ్లిక్స్ డ్రామా సిరీస్ 'స్కూప్' (2023) తో ఇటీవ‌ల తిరిగి కంబ్యాక్ కోసం ప్ర‌య‌త్నాలు స్టార్ట్ చేసాడు.

హార్మ‌న్ బవేజా ఒక దర్శకుడు హ్యారీ బవేజా - నిర్మాత పమ్మి బవేజాల సంతానం. అతను బొంబాయిలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో .. లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చదివాడు. బాలీవుడ్ లో పెద్ద నిర్మాత కొడుకు ఫ‌ర్దీన్ ఖాన్ చాలా కాలంగా సినిమాల‌కు దూరంగా ఉన్నాడు. ఆర్జీవీతో అడ‌వి లాంటి చిత్రంలో న‌టించిన అత‌డికి కెరీర్ ప‌రంగా పెద్ద ఫ్లాపులు ఎదుర‌వ్వ‌డంతో న‌ట‌న‌కు దూరం కావాల్సి వ‌చ్చింది.

ఫర్దీన్ ఖాన్ నిర్మాత ఫిరోజ్ ఖాన్ వార‌సుడు. ఖాన్ కుటుంబంలో భాగమైన అతను ఫిల్మ్‌ఫేర్ అవార్డు గ్రహీత. ప్రేమ్ అగ్గన్ (1998)తో తన నటనా రంగ ప్రవేశం చేసాడు. తొలి తొలి చిత్ర‌ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. అతను జంగిల్ (2000) (ఆర్జీవీ), ప్యార్ తునే క్యా కియా (2001), భూత్ (2003), దేవ్ (2004), , నో ఎంట్రీ (2005) చిత్రాలలో నటించాడు. వ‌రుస‌గా ఫ్లాపుల‌తో తెర‌మ‌రుగ‌య్యాడు. 2010లో దుల్హా మిల్ గయాలో కనిపించిన తర్వాత నటనకు విరామం తీసుకున్నాడు.