Begin typing your search above and press return to search.

స్టార్ వైఫ్ రెస్టారెంట్‌లోకి దొంగ‌లా దూరాడు!

కింగ్ ఖాన్ షారూఖ్ భార్య గౌరీ ఖాన్ దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరు. గౌరీ ప్ర‌ముఖ ఇంటీరియ‌ర్ డిజైన‌ర్

By:  Tupaki Desk   |   14 Feb 2024 6:00 AM GMT
స్టార్ వైఫ్ రెస్టారెంట్‌లోకి దొంగ‌లా దూరాడు!
X

కింగ్ ఖాన్ షారూఖ్ భార్య గౌరీ ఖాన్ దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరు. గౌరీ ప్ర‌ముఖ ఇంటీరియ‌ర్ డిజైన‌ర్. నిర్మాత‌గా సినిమాలు తీస్తున్నారు. బాలీవుడ్‌లో కొన్ని అత్యుత్తమ అతిపెద్ద హిట్ చిత్రాల‌ను నిర్మించారు. ఇంటీరియర్ డిజైనర్ గా అప‌ర కుభేరులు ముఖేష్ అంబానీ, రాబర్టో కావల్లి, రాల్ఫ్ లారెన్ వంటి బిజినెస్‌మేన్‌ల‌ కోసం ఇంటి డిజైన్ లు, ఆఫీస్ స్పేస్‌లను డిజైన్ చేసారు. ఇప్పుడు గౌరీ ఇటీవల బాంద్రాలో ప్రోగ్రెసివ్ ఏషియన్ రెస్టారెంట్ అయిన `టోరీ`ని ప్రారంభించి హోట‌ల్ రంగంలోను త‌న శైలిని ప‌రిచ‌యం చేస్తున్నారు.

నిన్నటిరోజున‌ గౌరీ తన సరికొత్త రెస్టారెంట్ లాంచ్ సంద‌ర్భంగా స్నేహితుల కోసం ఇంటిమేట్ లాంచ్ పార్టీని నిర్వహించింది. గౌరీ ఖాన్ టోరీ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి కరణ్ జోహార్‌ సహా సన్నిహితులు హాజరయ్యారు. `రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ` అనే హిట్ చిత్రాన్ని అందించిన తర్వాత ఇటీవల వార్తల్లో నిలిచిన గౌరీ ఖాన్ ఇప్పుడు రెస్టారెంట్ వ్యాపారంతో హాట్ టాపిక్ గా మారుతున్నారు. పూర్తిగా నలుపు రంగు దుస్తులలో క‌ర‌ణ్‌ పార్టీకి హాజరయ్యారు. పార్టీలో క‌ర‌ణ్‌ బ్లాక్ బ్లేజ‌ర్ లో స్పెష‌ల్ గా క‌నిపించాడు. కరణ్‌తో పాటు, భావా పాండే, మహీప్ కపూర్, నీలం కొఠారి, చుంకీ పాండే, సీమా కిరణ్ సజ్దే, అవినాష్ గోవారికర్, అర్స్లాన్ గోని, సుస్సానే ఖాన్ తదితరులు వేడుకలో పాల్గొన్నారు.

కొద్ది రోజుల క్రితం, గౌరీ తన మొదటి రెస్టారెంట్ టోరికి చెందిన‌ లగ్జరీ ఇంటీరియర్‌ను చూపించే ఫోటోల‌ను ఇన్ స్టాలో షేర్ చేసారు. ఆతిథ్య రంగంలో Toriimumbaiలో నా మొదటి వెంచర్. మా అద్భుతమైన బంగారు స్వరాలు, శక్తివంతమైన లైటింగ్ .. గొప్ప లగ్జరీ వామీ ఆథక్యంలో మునిగిపోండి... అని రాసింది.

గౌరీ ఖాన్ త‌న టోరి రెస్టారెంట్ ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అయ్యాయి. అభిమానులు త‌న‌పై ప్రేమను కురిస్తున్నారు. టోరీని సందర్శించడానికి ఎదురు చూస్తున్నాను అంటూ అభిమానులు వ్యాఖ్య‌ల్ని జోడిస్తున్నారు. వీరితో పాటు ఫరా ఖాన్ కూడా పోస్ట్‌పై వ్యాఖ్యానిస్తూ గౌరీపై ప్రశంసలు కురిపించారు.