టోవినో థామస్ A.R.M ఎలా ఉంది..?
మలయాళంలో తనదైన శైలులో ప్రత్యేకమైన సినిమాలు చేసుకుంటూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు టోవినో థామస్.
By: Tupaki Desk | 14 Sep 2024 12:16 PM GMTమలయాళంలో తనదైన శైలులో ప్రత్యేకమైన సినిమాలు చేసుకుంటూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు టోవినో థామస్. ఒకే రకమైన సినిమాలు చేయకుండా రకరకాల కథలు చేస్తూ తన పాపులారిటీ పెంచుకున్నాడు. అతను నటించిన కొన్ని సినిమాలు తెలుగు లో కూడా రిలీజ్ చేశారు. లేటెస్ట్ గా టోవినో థామస్ నటించిన A.R.M సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజైంది. A.R.M అజయంతే రందం మోషనం అనేది అసలు సినిమా పేరు. ఈ సినిమా సెప్టెంబర్ 12న రిలీజైంది. టోవినో థామస్ తో కృతి శెట్టి, ఐశ్వర్య లక్ష్మి, సురభి హీరోయిన్ గా నటించారు.
A.R.M కథ విషయానికి వస్తే.. ఇదొక ఫిక్షనల్ స్టోరీ. చియోతికవు అనే ఊరు ఉంటుంది. అందులో 3 పీరియడ్స్ లో ఈ సినిమా నడుస్తుంది. 1900, 1950, 1990 కాలాల్లో ఈ సినిమా నడుస్తుంది. ఒక విగ్రహం ముగురు వ్యక్తుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఐతే ఇందులో టోవినో థామస్ ఒక యోధుడిగానే కాదు దొంగగా కూడా నటించాడు. చందమామ కథ లాంటి నరేషన్ తో స్క్రీన్ ప్లే రాసుకున్నారు. సినిమాలో చాలా అంశాలు ఉన్నా కూడా విలన్ అంత బలంగా లేకపోవడం మైనస్ అని చెప్పొచ్చు. సినిమాలో సామాజిక అంశాల మీద కూడా దర్శకుడు తన అంతర్లీనమైన కోణాన్ని చూపించాడు. సినిమా సెకండ్ హాఫ్ లో కొంత డ్రామా లాగ్ అయినట్టు అనిపిస్తుంది.
A.R.M సినిమా పెద్ద స్కేల్ లో తెరకెక్కించారు. ఆ విషయంలో మేకర్స్ ని మెచ్చుకోవచ్చు. మలయాళ సినిమాలు ఇష్టపడే వారికి ఒక ఈ సినిమా నచ్చుతుంది. నటన పరంగా టోవినో థామస్ మెప్పించాడు. 3 పాత్రల్లో ఆయన స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకు హెల్ప్ అయ్యింది. కృతి శెట్టికి అంత గొప్ప పాత్ర ఏమి కాదు కానీ ఉన్నంతలో బాగానే అనిపిస్తుంది. ఐతే టోవినో థామస్, కృతి సీన్స్ కూడా కొంత ల్యాగ్ అయినట్టుగా అనిపిస్తాయి. రోహిణికి మంచి పాత్ర ఇచ్చారు. బాసిల్ జోసెఫ్, హరీష్ ఉత్తమన్ తమ ఎఫర్ట్ పెట్టారు.
సినిమా నిర్మాతలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు. దిబు నినాన్ థామస్ అందించిన మ్యూజిక్ ఇంప్రెస్ చేస్తుంది. A.R.M సినిమా రైటింగ్ ఇంప్రెస్ చేస్తుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా ఆకట్టుకుంది. విలన్ అంత బలంగా లేకపోవడం, అక్కడక్కడ ల్యాగ్ అవ్వడం సినిమాకు మైనస్ గా నిలిచాయి.