అడవి తల్లితో ఆ ఇద్దరు హీరోలు లొల్లి!
త్వరలో షూటింగ్ కూడా ఆపేసేలా కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే `టాక్సిక్` పెద్ద నష్టమే.
By: Tupaki Desk | 21 Jan 2025 7:28 AM GMTయశ్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ `టాక్సిక్` చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య పీన్యా అటవీ ప్రాంతంలో వేలాది చెట్లు నరికివేతకు గురి కావడంతో టాక్సిక్ సంచలనమైంది. చెట్లను నరికేసి షూటింగ్ నిర్వహించడంపై అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే సీరియస్ అయ్యారు. చట్టపరమైన చర్యలకు దిగారు.
రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో అనుమతులు లేకుండా చెట్లను నరికి చదును చేసుకుని షూటింగ్ నిర్వహించడానికి అనుమతులు ఎలా అంటూ ఆరాలు మొదలవ్వడగా హిందుస్తాన్ మెషిన్ టూల్స్ సంస్థ నుంచి తమకు అనుమతులు వచ్చినట్లు...ఆ సంస్థ ఆధ్వర్యంలో అటవీ ప్రాంతం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాతలకు ప్రభుత్వం తరుపున నోటీస్ వెళ్లినట్లు సమాచారం.
దీంతో హిందుస్తాన్ మోషీన్ టూల్స్ తో పాటు నిర్మాతలు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. క్యాబినెట్ ఆమెదం లేకుండా డీనోటిపికేషన్ అప్రూవ్ చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ ఈ వివాదం కోర్టుకు వెళ్లింది. దీంతో ఈ వివాదానికి ఇప్పట్లో పుల్ స్టాప్ పడేలా కనిపించలేదు. త్వరలో షూటింగ్ కూడా ఆపేసేలా కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే `టాక్సిక్` పెద్ద నష్టమే.
ప్రత్యామ్నాయంగా అలాంటి లొకేషన్ వెతుక్కుని కొత్తగా అక్కడ షూటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. అదంతా అప్పటికప్పుడు జరిగే పని కూడా కాదు. నెల ..రెండు నెలలు సమయం పట్టే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వివాదం నేపథ్యంలో షూటింగ్ అనుకున్న టైమ్ లో పూర్తి చేయడం సాధ్యం అయ్యేది కాదు. మరి కోర్టు షూటింగ్ కి అక్కడ అనుమతిస్తుందా? నేరంగా పరిగణిస్తుందా? అన్నది చూడాలి.
సరిగ్గా ఇలాంటి వివాదంలో` కాంతార -2` కూడా ఎదుర్కుంటుంది. ` కాంతార` ప్రీక్వెల్ షూటింగ్ షూటింగ్ కర్ణాటకలోని గవిగుడ్డ సమీపంలో జరుగుతుంది. అయితే ఈ షూటింగ్ పై స్థానికుల నుండి వ్యతిరేకత తీవ్ర స్థాయిలో వచ్చింది. అనుమతి లేకుండా అటవీ ప్రాంతంలో చిత్రీకరణ, వన్యప్రాణులకు ఆటంకం కలిగించడం వంటి పర్యావరణ నిబంధనల ఉల్లంఘన చేస్తున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు. దీంతో `కాంతార` షూటింగ్ పై స్థానిక సామాజిక సంస్థలు, మాజీ జిల్లా పంచాయతీ సభ్యుడు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. నిబంధనలు ఉల్లంఘించి షూటింగ్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వివరణ కోరింది.