Begin typing your search above and press return to search.

యష్ 'టాక్సిక్'.. ఎంత వరకు వచ్చింది?

కోలీవుడ్ స్టార్ హీరో యష్ అప్ కమింగ్ మూవీ కోసం ఆడియన్స్, సినీ ప్రియులు ఎంతగానో వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   31 March 2025 7:03 AM
యష్ టాక్సిక్.. ఎంత వరకు వచ్చింది?
X

కోలీవుడ్ స్టార్ హీరో యష్ అప్ కమింగ్ మూవీ కోసం ఆడియన్స్, సినీ ప్రియులు ఎంతగానో వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ ఇప్పుడు టాక్సిక్ మూవీ చేస్తున్నారు. మాన్ స్టార్ మైండ్ క్రియేషన్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై యష్, వెంకటరమణ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్.. మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సినిమాపై ఆడియన్స్ లో హైప్ పెంచాయి. దీంతో మూవీ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా.. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయడమే కాదు.. పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదల చేయనున్నారు మేకర్స్.

అయితే ఇంగ్లీష్ లో కూడా టాక్సిక్ మూవీని తెరకెక్కిస్తుండడం గమనించాల్సిన విషయం. రీసెంట్ గా టాక్సిక్ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి 19వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఉగాది కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం టాక్సిక్ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. సౌత్ ముంబైలో ఉన్న కొలాబాలోని ఒక చర్చిలో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ అవుతున్నట్లు సమాచారం. అందులో యష్ పాల్గొంటున్నారట. ఆయనతోపాటు నటి తారా సుతారియా కూడా చిత్రీకరణలో పార్టిసిపేట్ చేసినట్లు తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అర్థమవుతోంది.

నిన్న రాత్రి ఇన్ స్టాగ్రామ్ లో షూటింగ్ లొకేషన్ నుంచి ఫోటోను షేర్ చేసింది తార. కానీ ఆమె మూవీలో నటిస్తున్నట్లు మేకర్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. త్వరలోనే ప్రకటిస్తారని ఇండస్ట్రీలో వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే యష్, తార రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో ముంబై షెడ్యూల్‌ ను ముగించాలని ప్లాన్ చేస్తున్నారట.

ఆ తర్వాత మరొక షెడ్యూల్‌ కోసం వేరే ప్లేస్ కు వెళ్లనున్నారని తెలుస్తోంది. కానీ మేకర్స్ షూటింగ్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. అయితే సినిమా రిలీజ్ కు చాలా టైమ్ ఉన్నందున.. రాబోయే కొన్ని నెలల్లో పాత్రలు, ఇతర విషయాలు అనౌన్స్ చేసే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయి.