టాక్సిక్ ద్వారా మహిళా సాధికారత ట్రై చేస్తుందా?
సెప్టెంబర్ నుంచి తదుపరి షెడ్యూల్ కి రంగం సిద్దం చేస్తున్నారు. ఇందులో యశ్ కి జోడీగా ఇప్పటికే కియారా అద్వాణీని తీసుకు న్నారు.
By: Tupaki Desk | 24 July 2024 5:53 AM GMTలేడీ డైరెక్టర్ సినిమాలో అంతా లేడీస్సే ఉండాలా? కీలక పాత్రల్ని లేడీ నటులకే అప్పగిస్తుందా? ఆవిడని చూస్తుంటే సినిమాల పరంగా మహిళా సాధికారత అన్న పదానికి సరైన అర్దం దొరుకుతుందా? అంటే అలాగే కనిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్ యశ్ `కేజీఎఫ్` తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని గీతూ మోహన్ దాస్ అనే లేడీ డైరెక్టర్ కథకి ఒకే చెప్పిన సంగతి తెలిసిందే. `టాక్సిక్` టైటిల్ తో ఆ చిత్రాన్ని పట్టాలెక్కించారు. ఇప్పటికే సినిమా షూటింగ్ దశలో ఉంది. కొన్ని షెడ్యూళ్లు కూడా పూర్తయ్యాయి.
సెప్టెంబర్ నుంచి తదుపరి షెడ్యూల్ కి రంగం సిద్దం చేస్తున్నారు. ఇందులో యశ్ కి జోడీగా ఇప్పటికే కియారా అద్వాణీని తీసుకు న్నారు. ఆమె కూడా షూటింగ్ లో పాల్గొంటుంది. యశ్ సోదరి పాత్రకి లేడీ సూపర్ స్టార్ నయనతారని తీసుకున్నారు. ఇక సినిమాలో మెయిన్ విలన్ గానూ లేడీ నటినే ఎంపిక చేసారు. ఆమె బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ. విలనీగా ఆమె పాత్ర నెక్స్ట్ లెవల్ ఉంటుందంటూ ఇప్పటికే ప్రచారం ఠారెత్తిపోతుంది.
అలాగే కరీనా కపూర్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఆ పాత్ర వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా రెండవ హీరోయిన్గా తారా సుతారియాని ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే మేకర్స్ ఆమెతో సంప్రదింపులు జరిపారు. ఆమె కూడా సానుకూలంగా స్పందించింది. అగ్రిమెంట్ కూడా పూర్తయితే తార కూడా టీమ్ తో జాయిన్ అవుతుంది. ఇలా టాక్సిక్ లో వరుసగా మహిళా నటీమణులు ఎక్కువ అవ్వడం ఆసక్తికరంగా మారింది.
దీంతో కొన్ని రకాల విమర్శలు తెరపైకి వస్తున్నాయి. లేడీ డైరెక్టర్ లేడీస్ అందర్నీ తీసుకుని మహిళా సాధికారత కోసం ట్రై చేస్తుందా? అంటూ ఓ నెటి జనుడు కామెంట్ చేసాడు. ఇంత వరకూ ఇందులో యశ్ అనే స్టార్ తప్ప మరో బమలైన మేల్ లీడ్ పేరు వినిపించలేదు. దీంతో సినిమాలో అసలు ప్రధాన ప్రతినాయకుడి పాత్ర ఉందా? లేదా? అన్న సందేహాలు మొదలయ్యాయి. 1950 మధ్య కాలంలో డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగే కథ ఇది. అప్పటివాతావరణానికి తగట్టు బెంగుళూరు ఔటర్ లో భారీ సెట్లు వేసి చిత్రీకరిస్తున్నారు.