Begin typing your search above and press return to search.

150 రోజులు యూకేలోనే విధ్వంసం!

రాకింగ్ స్టార్ య‌శ్ క‌థానాయ‌కుడిగా గీతూ మోహన్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   16 Jun 2024 5:20 AM GMT
150 రోజులు యూకేలోనే విధ్వంసం!
X

రాకింగ్ స్టార్ య‌శ్ క‌థానాయ‌కుడిగా గీతూ మోహన్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా చిత్రం `టాక్సిక్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇదీ భారీ యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం. ఇందుల్ య‌శ్ గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. `కేజీఎఫ్` కంటే మ‌రింత శక్త‌వంతంగా ఆ పాత్ర ఉంటుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం తొలి షెడ్యూల్ జ‌రుగుతోంది. య‌శ్ స‌హా కీల‌క న‌టీన‌టులంతా పాల్గొంటున్నారు.

తాజాగా న‌య‌న‌తార కూడా సెట్స్ కివెళ్ల‌డానికి రెడీ అవుతోంది. ఇదే షెడ్యూల్ లో య‌శ్, న‌య‌న‌ల‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిం చ‌నున్నారు. ఇప్ప‌టికే హ్యూమా ఖురేసీ కూడా టీమ్ తో జాయిన్ అయింది. న‌య‌న్ ఎంట్రీతో షెడ్యూల్ ముగుస్తుందని స‌మాచారం. దీంతో త‌దుప‌రి షెడ్యూల్ కి కూడా యూనిట్ అప్పుడే స‌న్నాహాలు మొద‌లు పెట్టింది. అయితే ఇది పూర్తిగా యూకేలో జ‌రిగే షెడ్యూల్ అని స‌మాచారం.

సింహ భాగ‌మంతా అక్క‌డే చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంద‌ని చిత్ర వ‌ర్గాల నుంచి తెలుస్తోంది. దాదాపు 150 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొన‌సాగుతుందిట‌. ఇందులో విదేశీ బృందం ఎక్కువ‌గా క‌నిపిస్తుంద‌ని చిత్ర వ‌ర్గాలు అంటున్నాయి. లాంగ్ షెడ్యూల్ కావ‌డంతో సినిమాకి సంబంధించిన కీల‌క‌మైన న‌టీన‌టులు, టెక్నీషియ‌న్లు మాత్ర‌మే యూకే షెడ్యూల్ లోజాయిన్ అవుతారు. బ్యాక్ డ్రాప్ అక్క‌డ‌ది కావ‌డంతో అక్కడ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌ను వినియోగించుకునేలా చిత్రం బృందం ప్ర‌ణాళిక సిద్దం చేస్తోందిట‌.

అలాగే ఈ షెడ్యూల్ లో కియారా అద్వాణీ కూడా జాయిన్ అవుతుంద‌ని మ‌రో స‌మాచారం . గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌కి కియారా పెయిర్ గా న‌టిస్తుంద‌ని వినిపిస్తుంది. అయితే న‌య‌న్ కూడా ఉండ‌టంతో ఆమె పాత్ర‌పై అస్ప‌ష్ట‌త నెల‌కొంది. దీంతో సినిమాలో ప్ర‌ధానంగా హైలైట్ అయ్యే హీరోయిన్ ఎవ‌రు? అన్న‌ది సందిగ్దంగా మారింది. హ్యూమా ఖురేషీ పాత్ర సినిమాకి ట‌ర్నింగ్ పాయింట్ లాంటింద‌ని లీకులందుతున్నాయి. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ సిరీస్ `పీకీ బ్లైండ‌ర్స్` ప్రేర‌ణ‌తో తెర‌కెక్కిస్తున్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది. అన్ని ప‌నులు పూర్తి చేసి వ‌చ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేయ‌నున్నారు.