Begin typing your search above and press return to search.

న‌పుంశ‌క పురుషుల చేష్ట‌ల‌పై చిన్మ‌యి సంచ‌ల‌నం!

అదంతా గ‌తం అనుకుంటే సోష‌ల్ మీడియాల్లో ఎంతో యాక్టివ్ గా ఉండే చిన్మ‌యి తాజాగా మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు

By:  Tupaki Desk   |   10 Nov 2023 3:54 PM GMT
న‌పుంశ‌క పురుషుల చేష్ట‌ల‌పై చిన్మ‌యి సంచ‌ల‌నం!
X

#మీటూ ఉద్య‌మ వేదిక‌గా గాయ‌ని కం డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి శ్రీ‌పాద సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. సీనియ‌ర్ లిరిసిస్ట్ వైర‌ముత్తు త‌న‌ను వేధించాడ‌ని బ‌హిరంగంగా ఆరోపించి పెను సంచ‌ల‌నంగా మారారు. ఆ త‌ర్వాత దానిపై చాలా విచార‌ణ‌లు సాగాయి.. కానీ వైర‌ముత్తుకు ఎలాంటి శిక్ష ప‌డ‌క‌పోవ‌డంతో చిన్మ‌యి త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌ని కూడా వాపోయారు.

అదంతా గ‌తం అనుకుంటే సోష‌ల్ మీడియాల్లో ఎంతో యాక్టివ్ గా ఉండే చిన్మ‌యి తాజాగా మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. చిన్మ‌యి ఈసారి న‌పుంశ‌క (హిజ్రా) క‌మ్యూనిటీ (ఎల్.జి.బి.టి.క్యూ) కి చెందిన మ‌గాళ్ల‌ గురించి ఇన్ స్టాలో ఘాటైన‌ కామెంట్లు చేసింది.

ఒక మ‌హిళ చెప్పింది. త‌న భర్త అక్ర‌మ‌సంబంధం క‌లిగి ఉన్నాడ‌ని.. భార్య గ‌ర్భ‌వ‌తి కాబ‌ట్టి వేరొకరితో సెక్స్ చ‌ట్ట‌బ‌ద్ధం చేసిందిట ఆమె ఫ్యామిలీ. LGBTQ వ్య‌క్తి చెప్పిన విష‌యం విన‌డానికే షాకింగ్ గా ఉంది.. అని రాసారు. ''LGBTQ పురుషులతో సంబంధాన్ని కలిగి ఉండటానికి మహిళలను వివాహం చేసుకున్న వందలాది మంది పురుషులు డేటింగ్ యాప్‌లలో ఉన్నారు. ఇది ఎప్పటికీ మోసం. చాలా మంది పురుషులు తమ కోసం ఇంత అద్భుతమైన విభిన్న నియమాలను ఎలా కలిగి ఉన్నారో ఆశ్చర్యంగా ఉంది'' అని చిన్మ‌యి ఇన్ స్టాలో రాసారు.

దీనికి ఒక హిజ్రా నుంచి రిప్లయ్ కూడా వ‌చ్చింది. అత‌డి ప్ర‌కారం..''ఒక విచిత్ర వ్యక్తిగా, నేను దీనితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. డేటింగ్ యాప్‌లలో చాలా మంది వివాహిత పురుషులు ఉన్నారు. వారు దానిని మోసం అని ఎప్పుడూ భావించరు. అంకుల్స్ చాట్‌లలో అసభ్యకరంగా మాట్లాడటం తప్పు అని నేను వారికి చెబుతాను. నేను దానితో ఏకీభవించను ..'' అని ఒక ఎల్.జి.బి.టి.క్యూ ప‌ర్స‌న్ రాసారు.

వేరొక‌ ఎల్.జి.బి.టి.క్యూ వ్య‌క్తి డేటింగ్ యాప్ లో షేర్ చేసిన మెసేజ్ ని కూడా చిన్మ‌యి షేర్ చేసారు. ''నేను డేటింగ్ యాప్ ల‌లో ఉన్నాను. అక్క‌డ వంద‌లాది పెళ్ల‌యిన మ‌గాళ్లు ఉన్నారు. భార్య‌తో కాకుండా ఇత‌రుల‌తో సెక్స్ కోసం వేచి చూస్తున్నారు. న‌న్ను న‌మ్మండి.. వారంతా భార్య‌ల‌తో కాకుండా వేరే మ‌గ‌వాళ్లతో సెక్స్ చేస్తారు. దానిని చీటింగ్ అని భావించ‌రు. నేను వేరొక మ‌గువ‌తో ప‌డుకోలేదు.. యు నో అని అంటారు. ఇలాంటి ప‌ని చేస్తూ కూడా సిగ్గు లేకుండా గిల్ట్ అన్నదే లేకుండా ఉంటారు. నా భార్య నాతో సెక్స్ కావాల‌నుకుంటుంది. కానీ నేను చేయ‌లేను గ‌నుక ఇక్క‌డికి వ‌స్తాను అంటారు'' అని చిన్మ‌యి షేర్ చేసిన స్క్రీన్ షాట్ మెసేజ్ లో ఉంది.