ట్రెండ్ ని సెట్ చేసే స్టోరీలు..డైరెక్టర్లు కావాలి!
ట్రెండ్ ని ఫాలో అవ్వడం కాదు ..ట్రెండ్ ని సెట్ చేయడం అన్నది గొప్ప విషయం. ఎవరి క్రియేటివిటీ వారు చాటగలగాలి.
By: Tupaki Desk | 25 Nov 2023 11:30 PM GMTట్రెండ్ ని ఫాలో అవ్వడం కాదు ..ట్రెండ్ ని సెట్ చేయడం అన్నది గొప్ప విషయం. ఎవరి క్రియేటివిటీ వారు చాటగలగాలి. సొంతంగా ఓ విజన్ తో ట్రెండ్ ని సృష్టించగలగాలి. అంతేగా ఒకరు వేసిన మార్గంలో మరొకరు వెళ్తే అందులో ప్రత్యేకత ఏముంది. తమకంటూ ఓ ఐడెంటిటీ ఉండేలా చూసుకోవాలి. అసలే తెలుగు సినిమా పాన్ ఇండియాని రీచ్ అయింది. పాన్ వరల్డ్ ని తాకడానికి ఎంతో సమయం పట్టదు. అలాంటి సమయంలో ఇంకా ఓల్డ్ ట్రెండ్ నే పట్టుకుంటే ఎలా? రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటి వరకూ ఎన్ని సినిమాలొచ్చాయో చెప్పాల్సిన పనిలేదు.
బాలయ్య..చిరంజీవి తరం నుంచి అల్లరి నరేష్ వరకూ సీమ ఫ్యాక్షనిజాన్ని టచ్ చేసిన హీరోలెంతో మంది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇప్పటికీ ఆ ట్రెండ్ ని ఇంకా ఫాలో అవుతాం అంటే ఎలా? హిట్ వస్తుందని అదే ట్రెండ్ ని పట్టుకుని కూర్చుంటే నీకెంటూ ఓ ఐడెంటీ ఎక్కడ? అన్నది వెదుక్కోవాల్సిన సన్నివేశం తప్పదు. ఈ విషయంలో సుకుమార్ కాస్త తెలివిగానే వెళ్లారు. ఆయన `పుష్ప` చిత్రాన్ని ప్రత్యేకంగా చిత్తూరు మాండ లీకాన్ని బేస్ చేసుకుని తీసారు.
ఇంతవరకూ చిత్తూరు యాసతో సినిమాలు రాలేదు కాబట్టి అది తెలుగు ఆడియన్స్ కి కొత్త అనుభూతి నిచ్చింది. అందుకే సుధీర్ బాబు కూడా తన కొత్త సినిమాని చిత్తూరు యాస బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నాడు. అతను ఎదుగుతున్న హీరో కాబట్టి పర్వాలేదు. కానీ సక్సెస్ అయిన వాళ్లు కూడా ఇంకా రాయలసీమ స్టోరీల్నే పట్టుకోవడం అన్నది ఆశ్చర్యకరం. ఇక ఏపీలో శ్రీకాకుళం యాలోనూ కొన్ని సినిమాల్లో కొన్ని పాత్రల్ని సృష్టించారు. ఈ యాసలో పూర్తి స్థాయి సినిమా రాలేదు. కేవలం పాత్రల వరకూ ఆయాసని పరిమితం చేస్తున్నారు.
అలాగే తెలంగాణ యాస నేపథ్యంలో కొన్ని సినిమాలొచ్చి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవలే బాలయ్య భగవంత్ కేసరితో మరోసారి నైజాం యాసలో మెప్పించారు. అందులో అనీల్ రావిపూడి కొత్తదాన్ని చూపించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. ఇక తెలుగులో కొన్ని ప్రాంతాల యాసల్ని పాత్రల వరకూ పరమితం చేసారు. కానీ ఈ యాసలనేవి మారాల్సిన సమయం వచ్చేసింది. పాన్ ఇండియాలో సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కంటెంట్ యూనిర్శల్ గా ఉంటూనే స్లాంగ్ ని హైలైట్ చేసి సక్సస్ అవ్వాలి. ఆ రకంగా పుష్ప పాన్ ఇండియాలో ఓ సంచలనమైంది. అలాంటి బెంచ్ మార్క్ చిత్రాల్ని ఆడియన్స్ కోరుకుంటున్నారు.