Begin typing your search above and press return to search.

‘త్రిబాణధారి బార్బరిక్’ - ప్రపంచం చూడని మహావీరుడు

తెలుగు సినిమా రంగంలో కొత్త ఆలోచనలతో ఉన్న యువ దర్శకులు స్టోరీ సెలెక్షన్ తో ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   6 Nov 2024 11:31 AM GMT
‘త్రిబాణధారి బార్బరిక్’ - ప్రపంచం చూడని మహావీరుడు
X

తెలుగు సినిమా రంగంలో కొత్త ఆలోచనలతో ఉన్న యువ దర్శకులు స్టోరీ సెలెక్షన్ తో ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. కంటెంట్‌కు ప్రాధాన్యమిస్తున్న ఈ కాలంలో, కమర్షియల్ సినిమాల కంటే ప్రయోగాత్మక చిత్రాలకే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ఈ తరుణంలో వనరా సెల్యులాయిడ్ అనే కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభమైంది. వీరి మొదటి ప్రాజెక్ట్ 'త్రిబాణధారి బర్బరిక్' టైటిల్ తోనే మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. ఇక ఈ సినిమా మోహన్ శ్రీవాత్స దర్శకత్వంలో రూపొందుతోంది.

విజయ్‌పాల్ రెడ్డి అదిధాల నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా ఉన్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘త్రిబాణధారి బర్బరిక్’ అనే టైటిల్ ఒక ప్రత్యేకమైన స్పూర్తిని అందిస్తోంది. ఈ పోస్టర్‌లో పురాణ గాథను ఆధునిక ప్రపంచంతో మిళితంగా చూపించనున్నారు. గటోత్కచుని కొడుకు బర్బరిక్ కథను ఒక బాలుడికి చెప్పినట్లు ఒక వాయిస్ ఓవర్‌తో ప్రారంభమవుతుంది.

‘‘ప్రపంచం చూడని మహావీరుడు’’ అంటూ బర్బరిక్ శక్తిని ప్రస్తావిస్తూ, ఆయనకు ఉన్న అత్యంత అద్భుతమైన సామర్ధ్యాలను తెలియజేస్తుంది. ఈ మోషన్ పోస్టర్‌లో బర్బరిక్ భీముని మనవడిగా, గటోత్కచుని కుమారుడిగా తన గర్వాన్ని ప్రకటిస్తున్నట్లుగా ఉంది. మూడు బాణాలను ఒకేసారి ప్రయోగించే శక్తి ఉన్న బర్బరిక్ పాత్ర విశేషంగా చూపించబడింది. ఈ పౌరాణిక గాథను ఆధునిక ప్రపంచానికి అనుసంధానిస్తూ పోస్టర్‌లో గాంధీవదారి అర్జున, పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం, గరుడ పురాణం వంటి పుస్తకాలు, ఆధునిక గన్ వంటి అంశాలు సస్పెన్స్‌ను పెంచుతున్నాయి.

ఇండియన్ సినిమా చరిత్రలో తొలిసారి ఈ సినిమాతో ఇన్ఫ్యూషన్ బ్యాండ్‌ సంగీతాన్ని అందించడం విశేషం. ఈ థీమ్ మ్యూజిక్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెచ్చేలా ఉంది. దర్శకుడు భారీ విజన్‌తో ఈ సినిమాను రూపొందించారని, నిర్మాతల సమర్పణ కూడా అత్యున్నత స్థాయిలో ఉందని ఈ మోషన్ పోస్టర్ ద్వారా తెలియజేసింది.

ఈ సినిమాలో సత్యరాజ్, వశిష్ఠ ఎన్ సింహా, సాంచి రాయ్, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, వీవీ గణేష్, మోట్టా రాజేంద్ర, ఉదయభాను ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీకి కుశేందర్ రమేశ్ రెడ్డి, ఎడిటింగ్‌కు మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్‌గా శ్రీనివాస్ పున్నా, యాక్షన్ సీక్వెన్స్‌లకు రామ్ సుంకర వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే విడుదలపై మరో అప్డేట్ ఇవ్వనున్నారు.