Begin typing your search above and press return to search.

కాల్ బోయ్ క్యారెక్ట‌ర్ అంటే సీఏ కేసు వేస్తాడా?

మార్కెట్ లో ఎన్నో ఓటీటీ కంపెనీలున్నా నెట్ ప్లిక్స్ మాత్రం ఓ బ్రాండ్ గా కొన‌సాగుతుంది.

By:  Tupaki Desk   |   11 July 2024 11:04 AM GMT
కాల్ బోయ్ క్యారెక్ట‌ర్ అంటే సీఏ కేసు వేస్తాడా?
X

మార్కెట్ లో ఎన్నో ఓటీటీ కంపెనీలున్నా నెట్ ప్లిక్స్ మాత్రం ఓ బ్రాండ్ గా కొన‌సాగుతుంది. అందుకు కార‌ణం అందులో కంటెంట్ మాత్ర‌మే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. వ‌ర‌ల్డ్ వైడ్ నెట్ ప్లిక్స్ కి ఉన్న క్రేజ్ వేరు. అంత‌లా స‌క్సెస్ అయిందంటే ద‌మ్మున్న కంటెంట్ తో మార్కెట్ లోకి రావ‌డంతోనే సాధ్య‌మైంది అన్న‌ది వాస్త‌వం. సెన్సార్ అంటూ ఉండ‌దు కాబ‌ట్టి కాస్త హ‌ద్దులు మీరిన కంటెంట్ ఎంతో ఉంది. నిజానికి నెట్ ప్లిక్స్ ఫేమ‌స్ అయింది కూడా ఆ ర‌క‌మైన కంటెంట్ తో పాటు, కాంట్ర‌వ‌ర్శీల‌కు కేరాఫ్ గా మారడంతోనే.

ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో వెబ్ సిరీస్ విష‌యంలో నెట్ ప్లిక్స్ హాట్ టాపిక్ గా మారింది. త్వ‌ర‌లో స్ట్రీమింగ్ కానున్న `త్రిభువన్ మిశ్రా సిఏ టాపర్` ట్రైలర్ పై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. స్టోరీ ప్ర‌కారం

టాప్ సీఏగా ఉండే త్రిభువన్.. తన క్లయింట్లలో కొంతమంది మహిళలతో శృంగరపరమైన సంబంధాలు పెట్టుకుంటాడు. వారిలో గ్యాంగ్ స్టర్ భార్య కూడా ఉంటుంది. ఓ సమయంలో దొరికిపోతాడు.

అతడ్ని పట్టుకునేందుకు గ్యాంగ్ స్టర్ వెంటపడతాడు. వారి నుండి తప్పించుకుని తిరుగుతుంటాడు ఈ సీఏ టాపర్. ఈ ట్రైలర్ మొత్తం అడల్ట్ కంటెంట్, యాక్షన్ సీన్స్ కనిపిస్తున్నాయి. దీంతో ఈ ట్రైల‌ర్ పై నెట్టింట విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఓయూజ‌ర్ ఇలా అభిప్రాయ‌ప‌డ్డాడు. `నేను నెట్ ప్లిక్స్ లో రాబోయే ఈ వెబ్‌సిరీస్‌ని తీవ్రంగా విమర్శిస్తున్నాను. మీ ప్లాట్‌ఫారమ్ నుండి వెంటనే తొలగించమని అభ్యర్థిస్తున్నాను`అన్నారు.

మరొక‌రు `నెట్‌ఫ్లిక్స్ లో CAలో సిరీస్‌తో వస్తోందని చూసినప్పుడు నేను ఎంతో సంతోషించాను. కానీ ట్రైలర్ చూసిన వెంటనే చాలా బాధ‌ప‌డ్డా. మా వృత్తిని చుల‌క‌న‌గా త‌క్కువ చేసి చూపించిన‌ట్లు ఉంది. మా గొప్ప వృత్తిని అగౌరవపర‌చ‌కండి` అని రాసుకొచ్చారు. మరొక వ్యక్తి ఇలా వ్రాశాడు `ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌గా, మీ రాబోయే విడుదల ట్రైలర్ చూససి అసభ్యతతో నేను తీవ్రంగా బాధపడ్డాను. మా సిరీస్ మా వృత్తి గౌరవాన్ని దెబ్బతీస్తుంది. విడుదల చేయడంపై పునరాలోచించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను` అని రాసుకొచ్చారు. మ‌రి వీటిని మేక‌ర్స్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారా? వాటితో సంబంధం లేకుండా రిలీజ్ చేస్తారా? అన్న‌ది చూడాలి. ఈనెల 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది.