సెల్పీ లో ఆ బ్యూటీ...త్రిదా చౌదరి అక్కలా!
తాజాగా అమ్మడు మరో న్యూ పిక్ తో నెట్టింట్లోకి వచ్చేసింది. ఇదిగో ఇక్కడిలా బ్లూ కలర్ జెబ్బల గౌనులో మిరుమిట్లు గొలుపుతోంది.
By: Tupaki Desk | 29 Nov 2024 4:54 PM GMTబెంగాలీ బ్యూటీ త్రిదా చౌదరి గురించి పరిచయం అవసరం లేదు. బెంగాలీ చిత్రాలతో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు అటుపై నిఖిల్ హీరోగా నటించిన 'సూర్య వర్సెస్ సూర్య' చిత్రంలో నటించింది. అటుపై 'మనసుకు నచ్చింది'..'7'..'అనుకున్నది ఒకటి..అయ్యింది ఒకటి' లాంటి చిత్రాల్లో నటించింది. కానీ ఇవేవి త్రిదాకి అంతగా పేరు తీసుకురాలేదు. హిందీలో కూడా కొన్ని సినిమాలు చేసింది. అక్కడా సక్సెస్ కాలేదు.
గత ఏడాది మాతృ భాషలోనే 'బూమ్ రాంగ్' అనే సినిమాలో నటించింది. కొన్ని వెబ్ సిరీస్ లకు పనిచేసింది. కానీ ఎక్కడా బిజీ కాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం త్రిదా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో సంబంధం లేకుండా ఇన్ స్టా బ్యూటీకి ఎంతో ఫేమస్ అయింది. ఎప్పటి కప్పుడు హాట్ ఫోటోలతో కుర్రాళ్ల హృద యాల్ని దోచేస్తుంది. బెంగాలీ స్టైల్ డిజైనర్ దుస్తుల్లో సంథింగ్ స్పెషల్ గా ఆకట్టుకుంటుంది.
తాజాగా అమ్మడు మరో న్యూ పిక్ తో నెట్టింట్లోకి వచ్చేసింది. ఇదిగో ఇక్కడిలా బ్లూ కలర్ జెబ్బల గౌనులో మిరుమిట్లు గొలుపుతోంది. అమ్మడు క్లీవేజ్ షోతో కాక పుట్టిస్తుంది. అమ్మడి మ్యాకప్ అలంకరణ ప్రతీది త్రిదాని మరింత అందంగా తీర్చిదిద్దాయి. సన్నని మెడపై అందమైన వైట్ అండ్ గ్రీన్ కలర్ జ్యూలెరీ ధరించింది.
చేతిలో ఫోన్...చూపులు మాత్రం మరో కెమెరా వైపు. ఆమె వెనుక మరో అందమైన లేడీ. ఆమె పేరు గౌతమి తలాటీ. అచ్చంగా త్రిదా చౌదరి పోలికలతోనే కనిపిస్తుంది. అమ్మడు త్రిదా చౌదరి అక్కా అంటూ నెటి జనులు పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.