Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : బీచ్‌లో అందాల చౌదరి

అందమైన బీచ్‌లో అంతకు మించిన సూర్యాస్తమయ సమయంలో త్రిధా చౌదరి బికినీలో ఫోటో షూట్‌ ఫోటోలను షేర్‌ చేసింది.

By:  Tupaki Desk   |   18 Jan 2025 4:28 AM GMT
పిక్‌టాక్‌ : బీచ్‌లో అందాల చౌదరి
X

బెంగాలీ సినిమాతో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ త్రిధా చౌదరి. ఆకట్టుకునే అందంతో పాటు నటిగా మంచి ప్రతిభ కనబర్చిన ఈ ముద్దుగుమ్మ బెంగాళీ సినిమాల్లోనే కాకుండా హిందీ, తెలుగు, తమిళ్‌ భాషల్లోనూ సినిమాల్లో నటించింది. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్‌ సిరీస్‌ల్లో, టీవీ షోల్లోనూ ఈ అమ్మడు నటించి ఆకట్టుకుంది. మైక్రో బయాలజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన త్రిధాకి సినిమాలపై ఆసక్తి ఎక్కువ. అందుకే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. అందంతో పాటు ప్రతిభ ఉన్నా అదృష్టం కలిసి రాకపోవడంతో ఎక్కువ సినిమాల్లో నటించే అవకాశాలు ఈ అమ్మడికి దక్కడం లేదు.

తెలుగులో ఈ అమ్మడు సూర్య vs సూర్య సినిమాలో నిఖిల్‌కి జోడీగా నటించింది. ఆ సినిమా పెద్దగా ఈమెకి గుర్తింపు తెచ్చి పెట్టలేదు. అయినా టాలీవుడ్ నుంచి ఈ అమ్మడికి ఆఫర్లు వచ్చాయి. అనుకున్నది ఒకటి అయినది ఒకటి, 7, మనసుకు నచ్చింది సినిమాల్లో నటించిన త్రిధాకి పెద్దగా గుర్తింపు దక్కలేదు. దాంతో హిందీ, బెంగాలీ సినిమాలపై దృష్టి పెట్టింది. గత ఏడాది ఈమె నుంచి సినిమాలు ఏమీ రాలేదు. అయితే ఇటీవల ఈమె ఒక సినిమాకు కమిట్‌ అయ్యిందని, ఈ ఏడాదిలో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. బాలీవుడ్‌లో ఈ అమ్మడి తదుపరి సినిమా ఉంటుందని తెలుస్తోంది.

త్రిధా చౌదరి సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. 3 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న త్రిధా చౌదరి తాజాగా మరోసారి తన అందమైన క్యూట్‌ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. అందమైన బీచ్‌లో అంతకు మించిన సూర్యాస్తమయ సమయంలో త్రిధా చౌదరి బికినీలో ఫోటో షూట్‌ ఫోటోలను షేర్‌ చేసింది. ఇంతటి అందగత్తెకు ఎందుకు ఆఫర్లు రావడం లేదని కొందరు కామెంట్స్ చేస్తే, మరికొందరు మాత్రం ఈ అమ్మడి అందానికి ముందు ముందు అయినా వరుసగా ఆఫర్లు వస్తాయనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాలు మాత్రమే చేయకుండా వెబ్ సిరీస్‌ల్లోనూ ఈమె కనిపిస్తున్న నేపథ్యంలో ముందు ముందు మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు అంటున్నారు. బాలీవుడ్‌లో ఈ అమ్మడు చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేరకు సఫలం అవుతాయి అనేది చూడాలి. గత ఏడాది కాలంగా ఒక్క సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేక పోయింది. అదే సమయంలో ఈమె నటించిన ఒక్క వెబ్‌ సిరీస్‌ కూడా స్ట్రీమింగ్ కాలేదు. ఏడాది గ్యాప్‌కి కారణం ఏంటి అనే విషయమై నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే త్రిధా ఆ సమయంలోనూ సోషల్‌ మీడియా ద్వారా అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ వచ్చింది.