Begin typing your search above and press return to search.

బికినీ బీచ్‌లో త్రిధా విర‌హ వేద‌న‌

త్రిధా చౌదరి బీచ్ లో బోల్డ్ ఫోజ్ గుబులు పెంచుతోంది. ఈ బ్యూటీ టోన్డ్ దేహ‌శిరుల్ని ఎలివేట్ చేస్తూ బ్లాక్ బికినీలో అందాలు ఆర‌బోసింది.

By:  Tupaki Desk   |   19 March 2025 8:36 AM IST
బికినీ బీచ్‌లో త్రిధా విర‌హ వేద‌న‌
X

బికినీలు, స్విమ్ సూట్ల‌తో దుమ్ము రేప‌డం త్రిధా చౌద‌రికి కొత్తేమీ కాదు. `ఆశ్ర‌మ్` వంటి బోల్డ్ వెబ్ సిరీస్ లో గుబులు పుట్టించే న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న ఈ బ్యూటీ, వ‌రుస ఫోటోషూట్ల‌తో సోష‌ల్ మీడియాల్లోను భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా త్రిధా షేర్ చేసిన ఇన్‌స్టా ఫోటోగ్రాఫ్‌ అంత‌ర్జాలంలో వైర‌ల్‌గా మారింది.

త్రిధా చౌదరి బీచ్ లో బోల్డ్ ఫోజ్ గుబులు పెంచుతోంది. ఈ బ్యూటీ టోన్డ్ దేహ‌శిరుల్ని ఎలివేట్ చేస్తూ బ్లాక్ బికినీలో అందాలు ఆర‌బోసింది. ముఖ్యంగా త్రిధా ఒంటిపై ఆ న‌ల్ల‌ని టాటూలు యూత్ ని ఆక‌ర్షిస్తున్నాయి. ఇంత‌కుముందు త్రిధా చౌదరి పూల్ సైడ్ ట్రీట్ ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. చిక్ స్విమ్‌వేర్ స్టైల్ లో క్యూట్ బ్యూటీ ఎంతో అందంగా క‌నిపించింది. దానికి భిన్నంగా ఇప్పుడు బ్లాక్ బికినీలో బీచ్ లో ఫోజులిచ్చింది. బికినీలు, స్విమ్‌సూట్‌లతో బీచ్‌వేర్ వార్డ్‌రోబ్ లో త్రిధా ప్ర‌త్యేక‌త‌ను ఈ ఫోటోషూట్లు ఎలివేట్ చేస్తున్నాయి. ప్ర‌స్తుతం త్రిధా వ‌రుస ఫోటోషూట్లు వైర‌ల్ గా దూసుకెళుతున్నాయి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. `సూర్య వర్సెస్ సూర్య` చిత్రంలో నిఖిల్ స‌ర‌స‌న న‌టించిన ఈ భామ‌ ఆ త‌ర్వాత‌ `మనసుకు నచ్చింది` అనే చిత్రంలోనూ న‌టించింది. సెవెన్, అనుకున్న‌దొక్క‌టి అయిన‌దొక్క‌టి చిత్రాల్లోను న‌టించింది. ప్ర‌స్తుతం వెబ్ సిరీస్ ల‌తోను పేరు తెచ్చుకుంటోంది. కొన్నేళ్ల క్రితం స్పాట్ లైట్ అనే వెబ్ సిరీస్ లో త్రిధా అందాలు ఆర‌బోసిన తీరు చ‌ర్చ‌గా మారింది. వెబ్ సిరీస్ ఆద్యంతం వేడెక్కించే లిప్ లాక్ ల‌తో గుబులు పెంచింది. ఆ త‌ర్వాత బాలీవుడ్ లో `షంషేరా`లాంటి భారీ చిత్రంలోనూ న‌టించింది. ఇటీవ‌లి వెబ్ సిరీస్ `ఆశ్ర‌మ్ 3` త‌న‌కు మంచి పేరును తెచ్చింది.