Begin typing your search above and press return to search.

బులుగు బ్రాలో యంగ్ బ్యూటీ క‌వ్వింత‌

ఇటీవ‌ల‌ స్పాట్ లైట్ అనే వెబ్ సిరీస్ లో త్రిధా అందాలు ఆర‌బోసిన తీరు చ‌ర్చ‌గా మారింది.

By:  Tupaki Desk   |   19 Jan 2025 6:06 AM GMT
బులుగు బ్రాలో యంగ్ బ్యూటీ క‌వ్వింత‌
X

క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్ తో కిల్ చేయ‌డంలో త్రిధా చౌద‌రి తర్వాతే! త్రిష‌కు మోడ్ర‌న్ వెర్ష‌న్ లా క‌వ్విస్తుంది ఈ బ్యూటీ. టాలీవుడ్ యంగ్ హీరోల స‌ర‌స‌న వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంది. 'సూర్య వర్సెస్ సూర్య' చిత్రంలో నిఖిల్ స‌ర‌స‌న న‌టించిన ఈ భామ‌ ఆ త‌ర్వాత‌ 'మనసుకు నచ్చింది' అనే చిత్రంలోనూ న‌టించింది. సెవెన్, అనుకున్న‌దొక్క‌టి అయిన‌దొక్క‌టి చిత్రాల్లోను న‌టించింది. జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా నేటిత‌రం హీరోల‌కు త్రిధా మంచి ఆప్ష‌న్.


ఇటీవ‌ల‌ స్పాట్ లైట్ అనే వెబ్ సిరీస్ లో త్రిధా అందాలు ఆర‌బోసిన తీరు చ‌ర్చ‌గా మారింది. వెబ్ సిరీస్ ఆద్యంతం వేడెక్కించే లిప్ లాక్ ల‌తో గుబులు పెంచింది. ఆ త‌ర్వాత బాలీవుడ్ లో 'షంషేరా'లాంటి భారీ చిత్రంలోనూ న‌టించింది. కానీ ఇవేవీ త‌న ఫేట్ ని మార్చ‌లేక‌పోయాయి.

వీట‌న్నిటినీ మించి త్రిధా ప‌ట్టుద‌ల ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. సోష‌ల్ మీడియాల్లో ఈ భామ‌ జ‌రంత స్పీడ్ క‌న‌బరుస్తోంది. ఇన్ స్టాలో నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో త‌న ఫాలోవ‌ర్స్ ని యంగేజ్ చేస్తోంది. తాజాగా త్రిధా షేర్ చేసిన కొత్త ఫోటోగ్రాఫ్ గుండెల్లో గుబులు పెంచుతోంది. ఈ ఫోటోగ్రాఫ్ లో త్రిధా బ్లూ అండ్ బ్లూ లుక్ లో క‌నిపించింది. శ‌రీరాన్ని అతుక్కుపోయే బ్లూ టాప్ ని ధ‌రించి, టైట్ ట్రాక్ లో హీట్ పెంచింది త్రిధా. త్రిధా ఫోటోషూట్ ఇప్పుడు యూత్‌లో హాట్ టాపిక్ గా మారింది. క్యూట్ బ్యూటీ సో హా* అంటూ ఫ్యాన్స్ ఘాటైన కామెంట్లు చేస్తున్నారు. త్రిధా అంద‌చందాల‌కు ముగ్ధుల‌వుతున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ని వాట్సాపుల్లోను జోరుగా వైర‌ల్ చేస్తున్నారు.

త్రిధా నెక్ట్స్ ఏంటి? అంటే.. దానికి త‌న నుంచే స‌రైన‌ స‌మాధానం రావాల్సి ఉంది. ఇటీవల బెంగాలీ చిత్రం 'బూమరాంగ్‌'లో కనిపించింది. త‌దుప‌రి ద‌క్షిణాదిన మ‌రిన్ని క‌థ‌లు వింటోంద‌ని స‌మాచారం. ఈ బ్యూటీ టాలీవుడ్ లో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌ను సంప్ర‌దిస్తోంద‌ని స‌మాచారం. క‌థ‌లు వింటూ, స‌రైన అవ‌కాశం కోసం ప్ర‌స్తుతం వేచి చూస్తోంది. తెలుగులో త‌దుప‌రి చిత్రాన్ని ప్ర‌క‌టించ‌డానికి కొంత స‌మ‌యం ప‌ట్టొచ్చ‌ని చెబుతున్నారు.