Begin typing your search above and press return to search.

స్వీమ్ షూట్ లో క్యూట్ బ్యూటీ సెగ‌లు!

టూపీస్..బికినీ స్విమ్ షూట్లు హీరోయిన్లు అంతా మెప్పిస్తుంటారు. ఫ్రెష్ ఫీల్ ని తీసుకురావ‌డం కోసం ర‌క‌ర‌కాల స్విమ్ షూట్లు ధ‌రిస్తుంటారు

By:  Tupaki Desk   |   25 July 2024 2:30 AM GMT
స్వీమ్ షూట్ లో క్యూట్ బ్యూటీ సెగ‌లు!
X

టూపీస్..బికినీ స్విమ్ షూట్లు హీరోయిన్లు అంతా మెప్పిస్తుంటారు. ఫ్రెష్ ఫీల్ ని తీసుకురావ‌డం కోసం ర‌క‌ర‌కాల స్విమ్ షూట్లు ధ‌రిస్తుంటారు. కెమెరా అప్పిరియ‌న్స్ బ్యూటీలంతా ప‌రిత‌పిస్తుంటారు. న‌లుగురిలో స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా హైలైట్ అవ్వాల‌నిది ప్లాన్. ఈ విష‌యంలో త్రిదా చౌద‌రి మ‌రింత అడ్వాన్స్ గా ఉంటుంది. డిజైన‌ర్ బీచ్ వేర్స్ లో క‌వ్వించ‌డం సొగ‌స‌రి ప్ర‌త్యేక‌త‌.

టూపీస్..బికినీలో కొత్త‌గా ట్రై చేయ‌డానికి నిరంత‌రం ప్ర‌య‌త్నిస్తుంది. చేతిలో సినిమాలు లేక‌పోయినా ఇన్ స్టాలో ల‌క్ష‌ల ఫాలోవ‌ర్స్ ఉన్నారంటే ఇది ప్ర‌ధాన కార‌ణ‌మ‌న్న‌ది తెలిసిందే. తాజాగా అమ్మ‌డు ప‌ర్పెక్ట్ బీచ్ వేర్ లో త‌ళుకులీనిన వైనం ఆహా అనిపిస్తుందంటే అతిశ‌యోక్తి కాదు. రిసార్స్ట్ లో అమ్మ‌డు ఇలా రిలాక్స్ అవుతోంది. వైట్ అండ్ గ్రీన్ కాంబినేష్ స్విమ్ షూట్ త్రిద స్కిన్ టోన్ కి ప‌ర్పెక్ట్ గా సూట‌యింది.

ఇందులో త్రిదా చౌద‌రి నేచుల‌ర్ బ్యూటీని హైలైట్ చేసింది. క్యూట్ స్మైల్ తో కెమెరాకి ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. త్రిదా అందం చూప‌రుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుం టోంది. సొగ‌స‌రి వెండి తెర‌పై క‌నిపించి చాలా కాల‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. త్రిదా చౌద‌రి బెంగాలీ అందం. తొలుత అక్క‌డి చిత్రాల‌తోనే ఎంట్రీ ఇచ్చింది.

అటుపై నిఖిల్ హీరోగా న‌టించిన `సూర్య వ‌ర్సెస్ సూర్య` చిత్రంలో న‌టించింది. ఆ త‌ర్వాత `మ‌న‌సుకు న‌చ్చింది`..`7`..`అనుకున్న‌ది ఒక‌టి..అయ్యింది ఒక‌టి` లాంటి తెలుగు చిత్రాల్లో న‌టించింది. కానీ ఇవేవి త్రిదాకి అంత‌గా పేరు తీసుకురాలేదు. హిందీలో కూడా కొన్ని సినిమాలు చేసింది. అక్క‌డా స‌క్సెస్ కాలేదు. గత ఏడాది మాతృభాష‌లోనే `బూమ్ రాంగ్` అనే సినిమాలో న‌టించింది. కొన్ని వెబ్ సిరీస్ ల‌కు ప‌నిచేసింది. కానీ ఎక్క‌డా బిజీ కాలేదు.