బాలయ్య డైలాగ్ పెట్టడానికి చాలా భయపడ్డాం: త్రినాథరావు నక్కిన
అయితే అభిమానులు కొన్నిసార్లు ఆ రిఫరెన్సుని పాజిటివ్ గా తీసుకుంటే మరికొన్ని సార్లు నెగిటివ్ గా తీసుకుంటూ ఉంటారు.
By: Tupaki Desk | 25 Feb 2025 12:30 PM GMTఒక హీరో సినిమాలో మరొక హీరో రిఫరెన్సులు వాడటం ఈ మధ్య ఎక్కువైపోయింది. స్టార్ హీరోల అభిమానులను ఎట్రాక్ట్ చేయడానికి చిన్న హీరోలు, చిన్న సినిమాలు తమ సినిమాల్లో ఆయా హీరోలకు సంబంధించిన డైలాగ్స్‌నో, పేరునో రిఫరెన్సు రూపంలో వాడుతూ ఉంటారు. అయితే అభిమానులు కొన్నిసార్లు ఆ రిఫరెన్సుని పాజిటివ్ గా తీసుకుంటే మరికొన్ని సార్లు నెగిటివ్ గా తీసుకుంటూ ఉంటారు.
సందీప్ కిషన్ హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన సినిమా మజాకా. రావు రమేష్, అన్షు ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 26న అంటే రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర యూనిట్ సినిమాను తెగ ప్రమోట్ చేస్తూ బిజీగా ఉంది.
అయితే ఈ సినిమా ట్రైలర్ లో బాలయ్య రిఫరెన్సుని వాడిన విషయం తెలిసిందే. బాలయ్య బాబు ప్రసాదం తీసుకో అని ఓ క్యారెక్టర్ అంటే, జై బాలయ్య అంటూ మరో క్యారెక్టర్ అనడంతో ట్రైలర్ బాగా వర్కవుట్ అయింది. అయితే ఈ రిఫరెన్స్ ను పెట్టడానికి తాను మొదట చాలా భయపడ్డానని, ఆయన ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఎంతో ఆలోచించినట్టు చెప్పాడు. కానీ బాలయ్య ఫ్యాన్స్ ఈ డైలాగ్స్ ను సరదాగా తీసుకున్నట్టు చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన చెప్పాడు.
ధమాకా సినిమా టైమ్ లో కూడా తనకు టాలీవుడ్ లోని అందరి హీరోల ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ దక్కిందని, వారే ధమాకాను అంత పెద్ద హిట్ గా నిలిపారని చెప్పిన త్రినాథరావు, ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ కూడా మజాకా విషయంలో హ్యాపీగా ఉన్నారని, ట్రైలర్ ను ఎంజాయ్ చేస్తూ బాలయ్య రిఫరెన్స్ ను చూసి ఎంజాయ్ చేస్తున్నారని అన్నాడు.
అయితే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పై కూడా ఓ డైలాగ్ పెట్టారట. ఓ సీన్ లో హీరోయిన్ నడుము చూసిన హీరో, పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇలాంటెప్పుడో చేసేశారని కామెంట్ చేస్తాడట. కానీ సెన్సార్ బోర్డు ఆ డైలాగ్ ను కట్ చేసిందని, పవన్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు ఇలాంటివి వస్తే అభ్యంతరాలు తలెత్తుతాయేమోననే ఆలోచనతో సెన్సార్ బోర్డ్ ఆ డైలాగుని కట్ చేసినట్టు ప్రమోషన్స్ లో హీరో సందీప్ కిషన్ వెల్లడించాడు.