Begin typing your search above and press return to search.

త‌న‌పై ఆరోప‌ణ‌ల్ని ఖండించిన యానిమ‌ల్ బ్యూటీ

ఈవెంట్‌కు హాజరయ్యేందుకు ఎలాంటి ఒప్పందం చేసుకోలేద‌ని, త‌మ‌కు ఎలాంటి డ‌బ్బు ముట్ట‌లేద‌ని ప్రెస్‌కి ఒక ప్రకటన జారీ చేసారు.

By:  Tupaki Desk   |   2 Oct 2024 3:17 PM GMT
త‌న‌పై ఆరోప‌ణ‌ల్ని ఖండించిన యానిమ‌ల్ బ్యూటీ
X

ముంద‌స్తు ఒప్పందం ప్ర‌కారం ఒక ఈవెంట్లో పాల్గొనేందుకు 5.5 ల‌క్ష‌ల మొత్తాన్ని అందుకుని చివ‌రికి ఈ వేడుక‌కు హాజ‌రు కాలేద‌ని ట్రిప్తి దిమ్రీపై మ‌హిళా పారిశ్రామిక వేత్త‌లు ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. జైపూర్‌లోని ఈవెంట్ నిర్వాహకుల ఆరోప‌ణ‌ల ప్ర‌కారం... ట్రిప్తీ రూ. 5.5 లక్షలు వసూలు చేసినప్పటికీ ఈవెంట్‌కు గైర్హాజ‌రు అయ్యార‌ని ఆరోపించారు. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌ను ఇప్పుడు ట్రిప్తి డిమ్రీ తిప్పి కొట్టారు. ట్రిప్టీ బృందం ఇవ‌న్నీ త‌ప్పుడు ఆరోప‌ణ‌లు అని అన్నారు. ఈవెంట్‌కు హాజరయ్యేందుకు ఎలాంటి ఒప్పందం చేసుకోలేద‌ని, త‌మ‌కు ఎలాంటి డ‌బ్బు ముట్ట‌లేద‌ని ప్రెస్‌కి ఒక ప్రకటన జారీ చేసారు.


FICCI -FLO మహిళా పారిశ్రామికవేత్తల‌ ప్రకారం,..``త‌మ‌ ఈవెంట్‌కు హాజరు కావడానికి ట్రిప్టి డిమ్రీకి రూ. 5.5 లక్షలు చెల్లించారు.. కానీ ఆమె హాజరు కాలేదు`` అని ఆరోపించారు. అయితే ట్రిప్తీ బృందం మీడియాకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ``తాను న‌టించిన‌ చిత్రం `విక్కీ విద్యా కా వో వాలా` వీడియో ప్రచారం సందర్భంగా ట్రిప్తీ డిమ్రీ త‌న‌ బాధ్యతలను పూర్తిగా గౌరవించింది. సినిమాకు సంబంధించిన అన్ని షెడ్యూల్డ్ ఈవెంట్‌లు, సెషన్‌లకు హాజరయ్యింది. ముఖ్యంగా తన సినిమా ప్రచార విధులకు మించి ఎలాంటి వ్యక్తిగత ప్రదర్శనలు లేదా ఈవెంట్‌లలో పాల్గొనలేదు. ఏదైనా ఈవెంట్ కోసం ఎటువంటి రుసుములు లేదా చెల్లింపులు జ‌ర‌గ‌లేదు`` అని వ్యాఖ్యానించారు. మహిళా పారిశ్రామికవేత్తలు చేసిన వాదనలను త్రిప్తి డిమ్రీ ప్రతినిధి తోసిపుచ్చారు.

ఇంత‌కుముందు ఫిక్కీ ఎఫ్ఎల్‌వో ఈవెంట్‌లోని వీడియోలలో నిర్వాహకులు త్రిప్తి డిమ్రీ హాజరుకానందుకు నిందించడం .. పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తామ‌ని ప్రకటించడం తెలిసిన‌దే. అయితే ఈ బృందంలోని ఒక మహిళ నటి ట్రిప్తీ దిమ్రీ పోస్టర్‌ను ధ్వంసం చేయడానికి ప్ర‌య‌త్నించింది. వైరల్ వీడియోలో ఒక మహిళ ఇలా చెప్పింది. ``తన సినిమాలు ఎవరూ చూడరు. వీళ్లు ప్రామిస్ చేస్తారు కానీ కనిపించరు. వారు సమయ నిర్వహణ నేర్చుకోవాలి. ఆమె అంత పెద్ద సెలబ్రిటీ నా? ఆమె పేరు కూడా ఎవరికీ తెలియదు. ఆమె ఎవరికీ తెలియదు. సెలబ్రిటీ అని పిలిపించుకునేందుకు అర్హ‌రాలు కాదు`` అని రాసారు. అదే వీడియోలో మరో మహిళ ట్రిప్తీ డిమ్రీని బహిష్కరించాలని డిమాండ్ చేసింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ట్రిప్తీ ఇటీవ‌లే విక్కీ కౌశల్ , అమీ విర్క్‌లతో బాడ్ న్యూజ్‌లో క‌నిపించింది. అలాగే రాజ్‌కుమార్ రావు సరసన `విక్కీ విద్యా కా వో వాలా` వీడియోలో నటిస్తుంది. భూల్ భూలయ్యా 3, ఆషిఖి 3 వంటి చిత్రాల్లోను న‌టించ‌నుంది.