డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ!
ఆకాంక్ష కంటే త్రిప్తి అయితే కార్తీక్ కి పర్పెక్ట్ జోడీగా సెట్ అవుతుందని అనురాగ్ పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు.
By: Tupaki Desk | 5 Feb 2025 6:30 PM GMT'ఆషీకీ' ప్రాంచైజీ నుంచి థర్డ్ ఇన్ స్టాల్ మెంట్ రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తుండగా అనురాగ్ బసు తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాంచైజీలో హీరోయిన్ అత్యంత కీలకమైన నేపథ్యంలో ఆ పాత్ర కోసం స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొణే..కత్రినా కైప్ లాంటి భామల్ని పరిశీలించారు. కానీ చివరి నిమిషంలో వాళ్లకంటే కొత్త నటి అయితే బాగుటుందని యువ నటి ఆకాంక్ష శర్మని అనుకుని చివరిగా ఆ ఛాన్స్ త్రిప్తీ డిమ్రీకి ఇచ్చారు.
ఆకాంక్ష కంటే త్రిప్తి అయితే కార్తీక్ కి పర్పెక్ట్ జోడీగా సెట్ అవుతుందని అనురాగ్ పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు. త్రిప్తీ కూడా ఒకే చెప్పింది. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్ నుంచి త్రిప్తీ డిమ్రీ ఎగ్జిట్ అయింది. పిలిచి మరీ అవకాశం ఇస్తే ఎగ్జిట్ అవ్వడంతో అనురాగ్ కాస్త అసంతృప్తిగానే ఉన్నాడు. ఎందుకు తప్పుకుందో తనకే తెలియాలనేసాడు. దీంతో డేట్లు సర్దుబాటు కాకపోవడంతోనే ప్రాజెక్ట్ వదులుకున్నట్లు చిత్ర వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం త్రీప్తీ డిమ్రీ బాలీవుడ్ లో `ధడక్ 2` లో నటిస్తోంది. దీంతో పాటు మరో చిత్రానికి కూడా అగ్రిమెంట్ చేసుకుంది. అయితే ఈ రెండు సినిమాలకు ఏక కాలంలో షూటింగ్ కి హాజరవుతుంది. ఇదే సమయంలో `ఆషీకీ -2` షూట్ కూడా ప్లాన్ చేస్తున్నారుట. దీంతో ఒకే సమయంలో మూడు సినిమా షూటింగ్ లకు హాజరు కావడం సాధ్యం కకాపోవడంతోనే అమ్మడు ఎగ్జిట్ అయినట్లు తెలుస్తోంది.
మూడేళ్ల క్రితం అవకాశం ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూసే బ్యూటీ ఇప్పుడు ఆషీకీ లాంటి గొప్ప చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చినా? వదులుకుందంటూ నెటి జనులు పోస్టులు పెడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో అనురాగ్ త్రీప్తిని ఏరికోరి మరీ తీసుకున్నాడు. ఎంపిక చేసిన తర్వాత త్రిప్తీ డిమ్రీని తొలగించారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. వాటిని మీడియా ముందుకొచ్చి మరీ అనురాగ్ ఖండిచాడు. ఆమెపై జరిగిన నెగిటివ్ ప్రచారాన్ని ఖండించి మద్దతుగా నిలిచాడు. కానీ చివరికి ఆయనకే హ్యాండ్ ఇచ్చిందీ బ్యూటీ.