Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : యానిమల్‌ బ్యూటీ క్లోజప్‌ అందాలు

తాజాగా మరోసారి ఈ అమ్మడు తన అందమైన ఫోటోలను షేర్‌ చేసింది.

By:  Tupaki Desk   |   20 Jan 2025 7:57 AM GMT
పిక్‌టాక్ : యానిమల్‌ బ్యూటీ క్లోజప్‌ అందాలు
X

త్రిప్తి డిమ్రీ సినిమా ఇండస్ట్రీలో నటిగా అడుగు పెట్టి చాలా కాలం అయినా దక్కని గుర్తింపు 'యానిమల్‌' సినిమాతో దక్కింది. ఓవర్‌ నైట్‌ స్టార్‌ హీరోయిన్‌గా పేరు దక్కించుకుంది. యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్‌తో చేసిన సన్నివేశాల కారణంగా త్రిప్తి డిమ్రీకి ఒక్కసారిగా గుర్తింపు లభించింది. యానిమల్‌లో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్న కంటే ఎక్కువగా త్రిప్తి గురించి మీడియాలో చర్చ జరిగింది. ప్రేక్షకులు సైతం త్రిప్తి గురించి మాట్లాడుకున్నారు. అందుకే యానిమల్‌ విడుదల అయిన వెంటనే బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ నాలుగు ఐదు సినిమాల్లో నటించే అవకాశాలు దక్కిన విషయం తెల్సిందే.


ఇప్పటికే బాలీవుడ్‌లో త్రిప్తి నటించిన సినిమాలు బ్యాక్ టుబ్యాక్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. యానిమల్‌ ఇచ్చిన క్రేజ్‌తో గత ఏడాది మూడు సినిమాలతో త్రిప్తి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు రెండు మూడు సినిమాలు చేస్తోంది. అవి మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మొత్తంగా త్రిప్తి జోరు మామూలుగా లేదు. ఓ రేంజ్‌లో ఈ అమ్మడు సినిమాలతో దూసుకు పోతుంది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం, అంతే కాకుండా నటనతో మెప్పించేంత ప్రతిభ ఈ అమ్మడికి ఉంది. అందుకే బిజీ బిజీగా సినిమాలు చేస్తుంది.


సినిమాలతో వచ్చిన క్రేజ్‌ కారణంగా సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి ఫాలోయింగ్‌ విపరీతంగా పెరిగింది. సోషల్‌ మీడియాలో తన ఫాలోవర్స్‌ కోసం ముద్దుగుమ్మ త్రిప్తి అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసారి ఈ అమ్మడు తన అందమైన ఫోటోలను షేర్‌ చేసింది. ఎక్కువ ఎబ్బెట్టుగా లేకుండా చాలా అందంగా కనిపించే విధంగా త్రిప్తి ఫోటోలకు ఫోజ్‌లు ఇస్తుందని అంటారు. బాలీవుడ్‌లో చాలా మంది హీరోయిన్స్‌తో పోల్చితే త్రిప్తి చాలా అందంగా ఉంటుందని, నటనతోనూ వారికంటే బెటర్‌గా మెప్పిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


తాజాగా క్లీ వేజ్‌ షో చేస్తూ క్లోజప్‌లో నడుము అందాన్ని చూపించిన ఈ అమ్మడి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ ఫోటోలు త్రిప్తి డిమ్రీ గురించి సోషల్‌ మీడియాలో మరింత ఎక్కువగా చర్చ జరిగేలా చేస్తుంది. ఇంత అందం ఉండి ఇన్నాళ్లు కనిపించకుండా ఎలా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. యానిమల్‌ సినిమాలో ఈమెని దర్శకుడు చూపించింది కొంచెమే అని, సోషల్ మీడియాలో షేర్‌ చేస్తున్న ఫోటోలను చూస్తూ ఉంటే మరింత అందంగా ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి యానిమల్‌ తో బ్రేక్ దక్కించుకున్న ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో ఎప్పుడు నటిస్తుందో చూడాలి.