Begin typing your search above and press return to search.

యానిమల్ బ్యూటీ చేసేవన్నీ ఆ పాత్రలే..!

ఆ ఏడాది చివర్లో వచ్చిన యానిమల్‌ తర్వాత వరుసగా సినిమా ఆఫర్లు త్రిప్తి తలుపు తట్టాయి అంటూ బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   30 Dec 2024 6:30 PM GMT
యానిమల్ బ్యూటీ చేసేవన్నీ ఆ పాత్రలే..!
X

తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్‌' సినిమాతో తృప్తి డిమ్రి ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయ్యింది. ఆ సినిమాలో రణబీర్‌ కపూర్‌తో చేసిన రొమాంటిక్ సీన్స్‌తో పాటు, నటనతోనూ మెప్పించింది. యానిమల్‌ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకున్న నేపథ్యంలో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్న కంటే తృప్తి డిమ్రికి ఎక్కువ ఫేం దక్కింది. బాలీవుడ్‌లో ఈ అమ్మడు ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్స్ జాబితాలో చేరింది. 2023లో యానిమల్‌ సినిమా వచ్చింది. ఆ ఏడాది చివర్లో వచ్చిన యానిమల్‌ తర్వాత వరుసగా సినిమా ఆఫర్లు త్రిప్తి తలుపు తట్టాయి అంటూ బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వచ్చాయి.

యానిమల్‌ వంటి బిగ్గెస్ట్‌ మూవీ తర్వాత చిన్నా చితకా సినిమాలు చేయకూడదు అనే ఉద్దేశ్యంతో వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్‌ని ఓకే అని చెప్పకుండా ఆచితూచి ఎంపిక చేసుకుంటూ నటించింది. ఈ ఏడాది తృప్తి నుంచి మూడు సినిమాలు వచ్చాయి. బ్యాడ్‌ న్యూస్‌ కి మంచి స్పందన వచ్చింది. భూల్‌ భులయ్యా 3 బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఈ ఏడాదిలో మూడు సినిమాలతోనూ మంచి పేరును సొంతం చేసుకోవడంతో పాటు డీసెంట్‌ హిట్‌లను సొంతం చేసుకున్న తృప్తి వచ్చే ఏడాది మరిన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ తృప్తి ని అభిమానించే వారు కొందరు ఆమె విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

2024లో ఆమె నటించిన మూడు సినిమాల్లోనూ అందాల ఆరబోతకి పరిమితం అయ్యింది. కొన్ని సీన్స్‌లో యాక్టింగ్‌తో మెప్పించినా మొత్తంగా ఆమెను గురించి మాట్లాడితే స్కిన్‌ షో గురించి మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ముందు ముందు ఆమె చేస్తున్న సినిమాలు, చేయబోతున్న సినిమాల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. స్కిన్‌ షో వరకే చేస్తే తక్కువ కాలంకే ఆమె ఫేడ్‌ ఔట్‌ అయ్యే ప్రమాదం ఉంది. కనుక నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకోవడం మాత్రమే కాకుండా సినిమా కథలో ప్రాముఖ్యత ఉన్న పాత్ర అయితేనే ఎంపిక చేసుకోవాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సందీప్‌ రెడ్డి ప్రస్తుతం స్పిరిట్‌ సినిమా వర్క్‌లో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలో స్పిరిట్‌ సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. 2025లోనే యానిమల్‌ సినిమాకు సీక్వెల్‌గా యానిమల్ పార్క్‌ను సందీప్‌ రెడ్డి వంగ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. యానిమల్‌ లో మంచి నటనతో మంచి పాత్రతో మెప్పించిన తృప్తికి యానిమల్‌ పార్క్‌లో ఛాన్స్ దక్కేనా అనేది చూడాలి. ఒక వేళ యానిమల్ పార్క్‌లోనూ ఆమె ఉంటే కచ్చితంగా సినిమాకు ప్లస్‌ కావడంతో పాటు ఆమె కెరీర్‌కి మంచి జరుగుతుంది అనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.