త్రిప్తి ప్రేమ్ కహాని..!
అంతేకాదు ఆయన సినిమాల్లో హీరో పాత్ర పేరు కూడా ఒకటే పెడుతూ వచ్చాడు.
By: Tupaki Desk | 26 Dec 2024 4:30 PM GMTబాలీవుడ్ క్లాసిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సూరజ్ భర్జత్యా 2015 లో ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమా తీయగా ఆ తర్వాత ఏడేళు గ్యాప్ తీసుకుని ఉంచై 2022 లో ఉంచై సినిమా చేశాడు. బాలీవుడ్లో సూపర్ హిట్ సినిమాలైన హమ్ ఆప్కె హై కౌన్, మైనే ప్యార్ కియా లతో తన మార్క్ ఏంటో చూపించిన సూరజ్ భర్జత్యా 35 ఏళ్ల కెరీర్ లో కేవలం 7 సినిమాలు మాత్రమే చేశారు. అంతేకాదు ఆయన సినిమాల్లో హీరో పాత్ర పేరు కూడా ఒకటే పెడుతూ వచ్చాడు. సూరజ్ భర్జత్యా సినిమాలో హీరో పేరు ప్రేమ్. ఆయన కథలు కూడా లవ్ స్టోరీ విత్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉంటాయి.
1994 మైనే ప్యార్ కియా నుంచి సూరజ్ ఇదే తరహా సినిమాలు చేస్తూ వస్తున్నారు. 2022 లో ఉంచై తర్వాత మరో కొత్త సినిమాతో త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్నారు సూరజ్. ఈ సినిమా కాస్టింగ్ విషయంలో కూడా బాలీవుడ్ లో స్పెషల్ డిస్కషన్ జరుగుతుంది. సూరజ్ సినిమాలో హీరో ఎవరన్నది తెలియదు కానీ పాత్ర పేరు ప్రేమ్ అని మాత్రం ఫిక్స్ అని తెలిసిందే. ఐతే ఈసారి బాలీవుడ్ లో ఆ ప్రేమ్ ఎవరంటూ కొన్నాళ్లు ఆసక్తికరమైన చర్చ జరిగింది.
ఫైనల్ గా నేషనల్ అవార్డ్ విన్నర్ ఆయుష్మాన్ ఖురానాని ప్రేమ్ పాత్రకి ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. సూరజ్ భర్జత్య డైరెక్షన్ లో తెరకెక్కనున్న నెక్స్ట్ సినిమాలో ఆయుష్మాన్ హీరోగా ఫిక్స్ అయ్యాడు. ఇక హీరోయిన్ గా కూడా యానిమల్ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న త్రిప్తి డిమ్రిని తీసుకుంటున్నారని తెలుస్తుంది. అంతకుముందు సినిమాలు, మ్యూజిక్ వీడియోలు చేసినా కూడా త్రిప్తికి యానిమల్ సినిమాతో సూపర్ క్రేజ్ ఏర్పడింది.
ఐతే ఆ సినిమా తో బోల్డ్ ఇమేజ్ సంపాదించిన త్రిపితికి వరుస అలాంటి పాత్రలే ఇస్తున్నారు. కానీ సూరజ్ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుంది. ప్రేమ్ కి ప్రేయసి గా త్రిప్తి నటించనుంది. మరి గ్లామర్ క్వీన్ గా క్రేజ్ తెచ్చుకున్న త్రిప్తి అంత బరువైన పాత్ర చేసి మెప్పించగలదా అన్నది బాలీవుడ్ లో చర్చ మొదలైంది. త్రిప్తి ఈ సినిమాతో మెప్పిస్తే మాత్రం ఆమెకు కేవల గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా వెరైటీ రోల్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి త్రిత్పి ఈ ప్రేమ్ కహాని ఎలా ఉండబోతుందో సినిమా వస్తేనే కానీ తెలుస్తుంది.