Begin typing your search above and press return to search.

యానిమల్ బ్యూటీ వెనకడుగు దేనికి..?

అయితే యానిమల్ లో చేసిన పాత్రల తరహాలోనే వస్తున్నాయని కూడా త్రిప్తి కొన్ని ఆఫర్లను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   27 March 2024 3:00 AM GMT
యానిమల్ బ్యూటీ వెనకడుగు దేనికి..?
X

ఎనిమిదేళ్ల క్రితమే మామ్ సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేసిన త్రిప్తి డిమ్రి లాస్ట్ ఇయర్ వచ్చిన యానిమల్ సినిమాతో సూపర్ పాపులర్ అయ్యింది. 8 ఏళ్ల కెరీర్ లో ఐదు సినిమాలు చేసినా రాని గుర్తింపు యానిమల్ సినిమాతో సంపాదించింది. యానిమల్ సినిమా త్రిప్తి ఫేట్ మార్చేసిందని చెప్పొచ్చు. ఆ సినిమా తర్వాత బాలీవుడ్ క్రేజియెస్ట్ హీరోయిన్స్ లిస్ట్ లో త్రిప్తి చేరిపోయింది. యానిమల్ సినిమా సౌత్ లో కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఇక్కడ కూడా అమ్మడికి సూపర్ క్రేజ్ ఏర్పడింది.

యానిమల్ తర్వాత బాలీవుడ్ లో వరుస ఛాన్సులు అందుకుంటున్న త్రిప్తి ప్రస్తుతం అక్కడ బాడ్ న్యూస్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాలతో పాటుగా భూల్ భులియా 3 సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఈ 3 సినిమాలతో అమ్మడు అదరగొట్టబోతుందని చెప్పొచ్చు. అయితే యానిమల్ క్రేజ్ తో తెలుగులో కూడా అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయని అంటున్నాయి.

ఇప్పటివరకైతే త్రిప్తి ని కన్ ఫర్మ్ చేస్తూ ఏ ఒక్క తెలుగు సినిమా నుంచి ప్రకటన రాలేదు. వార్తల్లో మాత్రం విజయ్ దేవరకొండతో యానిమల్ బ్యూటీ అని హడావిడి చేస్తున్నా త్రిప్తి సౌత్ సినిమాల మీద ముఖ్యంగా తెలుగు ఆఫర్ల మీద ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తున్నాయి కాబట్టి ఇక్కడ సినిమాలకు ఓకే చెప్పినా త్రిప్తి రేంజ్ పెరుగుతుందే తప్ప తగ్గదు.

కానీ త్రిప్తి ఎందుకో ఇంకా ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. టాలీవుడ్ దర్శక నిర్మాతలు మాత్రం త్రిప్తి ఇమేజ్ ని వాడుకునేందుకు రెడీగా ఉన్నారు. అయితే యానిమల్ లో చేసిన పాత్రల తరహాలోనే వస్తున్నాయని కూడా త్రిప్తి కొన్ని ఆఫర్లను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా మొన్నటిదాకా తనని ఎవరు పట్టించుకోకపోయినా యానిమల్ తో బిజీ నటిగా మారిపోయేలా చేశాడు సందీప్ వంగ. యానిమల్ సూపర్ హిట్ కాగా యానిమల్ పార్క్ అని ఆ సినిమా సీక్వెల్ ప్లానింగ్ లో ఉన్నాడు. ఒకవేళ ఛాన్స్ ఉంటే అందులో కూడా త్రిప్తిని తీసుకుంటారు. సో ఎలా చూసినా త్రిప్తికి రానున్న రోజుల్లో అన్నీ మంచి శకునములే అనేలా ఉంది.