Begin typing your search above and press return to search.

'యానిమల్‌' లో ఇలా ఎంటర్‌ అయ్యా...!

క్వాలా వెబ్‌ సిరీస్ లో నీ నటన బాగుంది, నేను తీయబోతున్న ఒక సినిమాలోని ఒక పాత్రకు నీవు సూట్ అవుతావని భావిస్తున్నాను అన్నారు.

By:  Tupaki Desk   |   10 Dec 2023 5:12 AM GMT
యానిమల్‌ లో ఇలా ఎంటర్‌ అయ్యా...!
X

రణబీర్ కపూర్‌ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సందీప్ వంగ దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమా ఇటీవల విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో రణబీర్‌ మరియు రష్మిక పాత్రలతో పాటు మరి కొన్ని పాత్రల గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది.

అందులో త్రిప్తి డిమ్రి పాత్ర గురించి పాజిటివ్‌ చర్చ జరుగుతోంది. నెట్‌ ఫ్లిక్స్ లో క్వాలా సిరీస్ ద్వారా ప్రేక్షకుల పరిచయం అయిన ఈ అమ్మడు యానిమల్‌ సినిమాలో కనిపించింది కొద్ది సమయం అయినా కూడా మంచి పేరును దక్కించుకుంది. యానిమల్‌ సినిమాలో ఎలా ఆఫర్‌ వచ్చింది అనే విషయం పై తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ అమ్మడు స్పందించింది.

త్రిప్తి మాట్లాడుతూ... ఒక యాడ్‌ షూట్‌ లో ఉన్న సమయంలో దర్శకుడు సందీప్‌ వంగ నుంచి కాల్‌ వచ్చింది. క్వాలా వెబ్‌ సిరీస్ లో నీ నటన బాగుంది, నేను తీయబోతున్న ఒక సినిమాలోని ఒక పాత్రకు నీవు సూట్ అవుతావని భావిస్తున్నాను అన్నారు. తప్పకుండా నటిస్తానంటూ ఆ సమయంలో చెప్పాను.

ఏడాది వరకు సందీప్ నుంచి కాల్‌ రాకపోవడంతో ఆఫర్‌ లేనట్లే అనుకున్నాను. కానీ చాలా రోజుల వెయిటింగ్ తర్వాత సందీప్ నుంచి కాల్‌ వచ్చింది. ఒక నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్ర కానీ మంచి పాత్ర అని ఆయన అన్నాడు. ఆయన ఇచ్చిన నమ్మకంతో సినిమా ను చేశాను. ఇప్పుడు ఆయన అన్నట్లుగానే నా పాత్రకు మరియు నాకు మంచి గుర్తింపు లభించిందని త్రిప్తి డిమ్రి అభిప్రాయం వ్యక్తం చేసింది.