ఆ సీన్లు చూసి అమ్మా నాన్న ఫీలయ్యారు
యానిమల్ తో రణబీర్ కపూర్ కలలు గన్న పాన్ ఇండియా విజయం దక్కింది. ఈ చిత్రంతో అతడు 1000 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టనున్నాడని ట్రేడ్ విశ్లేషిస్తోంది
By: Tupaki Desk | 11 Dec 2023 4:58 AM GMTయానిమల్ తో రణబీర్ కపూర్ కలలు గన్న పాన్ ఇండియా విజయం దక్కింది. ఈ చిత్రంతో అతడు 1000 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టనున్నాడని ట్రేడ్ విశ్లేషిస్తోంది. ఇదే సినిమాతో మరో అందాల నటి పేరు అంతే పాపులరైంది. ఈ చిత్రంలో రణబీర్ తో ఘాటైన బెడ్ రూమ్ సన్నివేశాల్లో జీవించిన త్రిప్తి డిమ్రీ గురించి యువతరం వాడి వేడిగా చర్చిస్తోంది. అంతేకాదు త్రిప్తి తదుపరి సందీప్ వంగా ప్రభాస్ తో తెరకెక్కించే భారీ చిత్రం 'స్పిరిట్'లో నటించనుందని కూడా ప్రచారం సాగుతోంది.
ఈ చిత్రంలో నటన త్రిప్తికి గొప్ప గుర్తింపు తెచ్చింది. సినిమాలో తన నటనకు నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకుంది. కథానాయకుడితో తెర నిండుగా రంజైన ఇంటిమేట్ సీన్స్‌తో కళ్లు తిప్పుకోనివ్వని ట్రీటిచ్చిన త్రిప్తి తాజా ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రుల గురించి ప్రస్థావిస్తూ.. వారు ఈ చిత్రాన్ని చూశారని, సన్నిహిత సన్నివేశాలను చూసి ఆశ్చర్యపోయారని వెల్లడించారు. అయితే వారిని కన్విన్స్ చేయడానికి సమయం పట్టిందని, తాను ఒక నటిగా తన పని తాను చేసినట్టు తెలిపానని అన్నారు.
త్రిప్తి తన గురించి తల్లిదండ్రులు ఎలా ఫీలయ్యారో చెప్పారు. ''నా తల్లిదండ్రులు కొంచెం ఆశ్చర్యపోయారు. మేము ఎప్పుడూ ఇలాంటివి సినిమాల్లో చూడలేదు.. కానీ ఇలాంటివి చేసావేమిటి?'' అని ఆశ్చర్యపోయారని తెలిపింది. అయితే ఆ సన్నివేశాన్ని అధిగమించడానికి వారికి సమయం పట్టింది. కానీ అవన్నీ నాకు చాలా మధురంగా అనిపించాయి. నువ్వు అలా చేసి ఉండకూడదు కానీ పర్వాలేదు... అని కూడా అమ్మా నాన్న అన్నారు. అమ్మా నాన్న అర్థం చేసుకున్నారు గనుక, మేము దీన్ని స్పష్టంగా అనుభవిస్తాం! అని త్రిప్తి న్యూస్ పోర్టల్‌తో అన్నారు.
నేను ఏ తప్పు చేయడం లేదని వారికి చెప్పాను. ఇది నా పని.. నేను సౌకర్యవంతంగా.. సురక్షితంగా ఉన్నంత వరకు.. దానిలో నాకు ఎటువంటి సమస్య కనిపించదు. నేను 100 శాతం నటిగా ఉండాలి అంటే నేను పోషించే పాత్ర పట్ల నిజాయితీగా ఉండి అలా చేశాను అని కూడా త్రిప్తి అన్నారు.
ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో రణబీర్- దర్శకుడు సందీప్ సన్నిహిత సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు తాను సౌకర్యవంతంగా ఉండేలా చూసుకున్నారని త్రిప్తి వెల్లడించింది. షూటింగ్‌లో ఉన్నప్పుడు రణబీర్ తనను ఓకేనా అని అడిగేవాడని చెప్పింది. నేను బాగున్నానా లేదా అనేది వారు నన్ను అడుగుతూనే ఉన్నారు. సన్నివేశం చిత్రీకరణ సమయంలో దర్శకుడు, డిఓపి, నటీనటులు సహా ఐదుగురు కంటే ఎక్కువ మంది వ్యక్తులు లేరని కూడా వారు నిర్ధారించారు. సెట్‌లోకి మరెవరినీ అనుమతించలేదు.. అన్ని మానిటర్లు కూడా మూసివేశారు.. అని త్రిప్తి తెలిపింది.
త్రిప్తి 2017లో 'పోస్టర్ బాయ్స్'తో తన నటనను ప్రారంభించింది. రొమాంటిక్ డ్రామా లైలా మజ్నులో తొలిసారి కథానాయికగా నటించింది. అయితే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 2020 చిత్రం 'బుల్ బుల్'లో తన పాత్రకు నటిగా మరింత గుర్తింపు పొందింది. అన్వితా దత్ దర్శకత్వం వహించిన సూపర్ నేచురల్ డ్రామా చిత్రం బుల్ బుల్.