Begin typing your search above and press return to search.

ఇద్ద‌రి బావ‌ల ముద్దుల మ‌ర‌ద‌లు!

బాలీవుడ్ లో అవ‌కాశాలు జోరందు కున్నాయి. త్రిప్తిని ఇంకాస్త క్రియేటివ్ గా చూపిస్తే ఎలా ఉంటుంది? అన్న కొత్త ఆలోచ‌న‌తో మేక‌ర్స్ క‌దులు తున్నారు.

By:  Tupaki Desk   |   29 Jun 2024 2:30 AM GMT
ఇద్ద‌రి బావ‌ల ముద్దుల మ‌ర‌ద‌లు!
X

త్రిప్తీ డిమ్రీ అలియాస్ బాబి-2 ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరిప్పుడు. `యానిమ‌ల్` స‌క్సెస్ తో అమ్మ‌డు పాన్ ఇండియాలో కుర్ర‌కారుని ఏ రేంజ్ లో షేక్ చేసిందో తెలిసిందే. నాటి నుంచి త్రిప్తీ పేరు నెట్టింట ఓ సంచ ల‌నం. ఆ క్రేజ్ ని అమ్మ‌డు తెలివిగా ఎన్ క్యాష్ చేసుకుంటుంది. బాలీవుడ్ లో అవ‌కాశాలు జోరందు కున్నాయి. త్రిప్తిని ఇంకాస్త క్రియేటివ్ గా చూపిస్తే ఎలా ఉంటుంది? అన్న కొత్త ఆలోచ‌న‌తో మేక‌ర్స్ క‌దులు తున్నారు.

అందుకు త‌గ్గ‌ట్టే అమ్మ‌డు కంప్లీట్ గా ద‌ర్శ‌కుల హీరోయిన్ అని ఎన్నోసార్లు ప్రూవ్ చేసింది. ఆ ర‌కంగా ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. అందాల ఆర‌బోత విష‌యంలో అమ్మ‌డు త‌గ్గేదేలే! నెట్టింట అమ్మ‌డు ఎప్ప‌టిక‌ప్ప‌డు చెల‌రేగుతోన్న వైనంతో ద‌ర్శ‌కుల్లో మ‌రింత జోష్ క‌నిపిస్తుంది. తాజాగా అమ్మ‌డి కొత్త సినిమా బ్యాడ్ న్యూస్ నుంచి ఓ పోస్ట‌ర్ రిలీజ్ అయింది. ఇందులో సొస‌గ‌రి ఇద్ద‌రి బావ‌ల ముద్దుల మ‌ర‌ద‌లిలా మురిపిస్తుంది.

లో దుస్తుల్లో త్రిప్తీ హాట్ హాట్ గా ట్రీట్ ఇచ్చేసింది. బాట‌మ్ లో జీన్స్ నిక్క‌రు ధ‌రించి ఇద్ద‌రి మ‌ధ్యా వైరాన్ని పుట్టిస్తుంది. `మీరు బిగ్గరగా నవ్వుకునేలా చేసే ధమకేదార్ యుద్ధం యొక్క స్నీక్ పీక్ అంటూ రాసుకొచ్చింది. ఇది ప‌క్కా కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ జోన‌ర్ లో తెర‌కెక్కిస్తోన్న చిత్రం. కానీ త్రిప్తీ లో బ్యూటీని మాత్రం ద‌ర్శ‌కుడు వినియోగించుకున్నాడు. మ‌రోసారి బ్యూటీలో రొమాంటిక్ యాంగిల్ ని ట‌చ్ చేసిన‌ట్లే క‌నిపిస్తోంది.

ఇప్ప‌టికే ఈ సినిమా ట్రైల‌ర్ కూడా రిలీజ్ అయింది. ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. ఇక త్రిప్తీ ఈ సినిమాగాక మ‌రో మూడు సినిమాలు చేస్తోంది. ఇవ‌న్నీ యానిమ‌ల్ స‌క్సెస్ తోనే అందుకుంది. భూల్ భుల‌య్యా -3, ధ‌డ‌క్ -2, విక్కీ విద్యా కా వో వాలా వీడియో చిత్రాలు చేస్తోంది. ఇవ‌న్నీ ఆన్ సెట్స్ లో ఉన్నాయి. చిత్రీక‌ర‌ణ సహా అన్ని ప‌నులు పూర్తి చేసుకుని ఇదే ఏడాది రిలీజ్ కానున్నాయి.