Begin typing your search above and press return to search.

వాళ్ల నోళ్లంతా ఏమయ్యాయి?

బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రీ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 7 ఏళ్ళు అయినా.. యానిమల్ మూవీతో లైమ్ లైట్ లోకి వచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 July 2024 11:37 AM GMT
వాళ్ల నోళ్లంతా ఏమయ్యాయి?
X

బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రీ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 7 ఏళ్ళు అయినా.. యానిమల్ మూవీతో లైమ్ లైట్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఆ సినిమాతో సౌత్ లో కూడా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. అమ్మడి స్కిన్ షోకు కుర్రాళ్లంతా ఫిదా అయ్యారు. దీంతో ఆమెకు ఫాలోవర్స్ ఒక్కసారిగా పెరిగిపోయారు. రీసెంట్ గా బ్యాడ్ న్యూజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

విక్కీ కౌశల్ ముఖ్య పాత్రలో నటించిన ఆ సినిమాలో కూడా హా* గా నటించి సినీ ప్రియులను ఫిదా చేసింది. బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయిన బ్యాడ్ న్యూజ్ మూవీ.. రూ.100 కోట్ల క్లబ్ వైపు పరుగులు తీస్తోంది. అయితే ఈ సినిమా కథాంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మూవీ ఓ యువతి ఇద్ద‌రు పురుషులతో సంబంధం పెట్టుకుని వాళ్ల ద్వారా గ‌ర్భం దాల్చుతోంది. ఆ తర్వాత తన క‌డుపులో ఉన్న బిడ్డ‌కు తండ్రెవ‌రో క‌నిపెట్టేందుకు ప‌రీక్ష‌లు పెట్టే కాన్సెప్ట్ తో మూవీ రూపొందింది.

అయితే స‌మాజంలో ఎవ‌రూ అంగీక‌రించలేని అంశం మీద ఈ సినిమా తెరకెక్కిందనే చెప్పాలి. కానీ ఎక్కడా ఎవరూ కూడా స్పందించడం లేదు. అంతా సైలెంట్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో యానిమల్ మూవీ లవర్స్ తోపాటు సందీప్ ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. యానిమ‌ల్ లో హీరో క్యారెక్ట‌రైజేష‌న్ తోపాటు మ‌హిళ‌ల‌ను చూపించిన తీరు బాగోలేదని ఎంతో మంది కామెంట్ చేశారు. హింస కూడా ఎక్కువైందని ఆరోపించారు.

అనేక మంది బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా యానిమల్ సినిమాపై ఆరోపణలు చేశారు. కానీ డైరెక్టర్ సందీప్ మాత్రం విమర్శలు చేసే వారికి ధీటుగా సమాధానాలు ఇచ్చారు. బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లకు పైగా వసుళ్లను రాబట్టడమే తన మూవీ రిజల్ట్ అని చెప్పారు. అయితే బ్యాడ్ న్యూజ్ పై ఎవరూ ఎలాంటి కామెంట్స్ చేయకపోవడంతో సందీప్ ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. అప్పుడు లేచిన నోళ్ళన్నీ ఇప్పుడు సైలెంట్ గా ఎందుకున్నాయని అడుగుతున్నారు.

బ్యాడ్ న్యూస్ మూవీ కాన్సెప్ట్ ను యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు.. యానిమల్ విషయంలో ఎందుకు విమర్శలు చేశారని ప్రశ్నిస్తున్నారు. దక్షిణాది దర్శకుడు.. బాలీవుడ్ లో సినిమా తీసి హిట్ కొట్టడమే విమర్శించడానికి కారణమా అని అడుగుతున్నారు. మొత్తానికి బ్యాడ్ న్యూజ్ వర్సెస్ యానిమల్ అన్నట్లు సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్ధం సాగుతోంది! మరి ఈ విషయంలో చివరకు ఏం జరుగుతుందో వేచి చూడాలి