Begin typing your search above and press return to search.

బాంద్రాలో బంగ్లా కొనేసిన ట్రిప్తి.. అన్ని కోట్లు విసిరికొట్టింది!

ఇటీవ‌ల వ‌రుస‌గా పాన్ ఇండియా చిత్రాల్లో అవ‌కాశాలు అందుకుంటోంది.

By:  Tupaki Desk   |   8 Jun 2024 6:46 AM GMT
బాంద్రాలో బంగ్లా కొనేసిన ట్రిప్తి.. అన్ని కోట్లు విసిరికొట్టింది!
X

సందీప్ వంగా 'యానిమల్' చాలామంది ఫేట్ మార్చేసింది. ర‌ణ‌బీర్ క‌పూర్ ని పాన్ ఇండియ‌న్ స్టార్ గా నిల‌బెట్టిన ఈ చిత్రం అంత‌గా ఫేమ్ లేని బాబి డియోల్ రేంజును అమాంతం స్కైలోకి చేర్చింది. అత‌డు వ‌రుస చిత్రాల‌తో బిజీ బిజీ అయ్యాడు. అలాగే యానిమ‌ల్ లో న‌టించింది కొద్దిసేపే అయినా కానీ, ట్రిప్తి దిమ్రీ ఫేట్ ఇప్పుడు అమాంతం మారిపోయింది. ట్రిప్తి నేష‌న‌ల్ క్ర‌ష్‌గా ఎదిగింది. ఇటీవ‌ల వ‌రుస‌గా పాన్ ఇండియా చిత్రాల్లో అవ‌కాశాలు అందుకుంటోంది.

ట్రిప్తీ వ‌రుస‌గా సీక్వెల్ సినిమాల్లో క‌థానాయిక‌ల‌ను రీప్లేస్ చేస్తోంది. 'ఆషిఖి 3' స‌హా ప‌లు చిత్రాల్లో ట్రిప్తి అవ‌కాశాలు అందుకుంది. ప్ర‌ఖ్యాత‌ భూల్ భూలైయా ఫ్రాంఛైజీలో పార్ట్ 3 లో న‌టిస్తూ బిజీగా ఉంది. క‌ర‌ణ్ జోహార్ ద‌ఢ‌క్ 2లోను అవ‌కాశం ఇచ్చారు. అలాగే 'బాడ్ న్యూజ్' (గుడ్ న్యూజ్ ఫ్రాంఛైజీ చిత్రం) చిత్రీకరణను పూర్తి చేసింది. త‌దుప‌రి స‌లార్ 2లోను న‌టించే ఛాన్సుంది. అయితే వ‌రుస‌గా అడ్వాన్సులు అందుకుంటున్న ట్రిప్తి దిమ్రీ త‌న సంపాద‌న‌ను ఏ రంగంలో పెట్ట‌బ‌డులు పెడుతోంది? అంటే త‌ను ఇత‌రుల‌కు ఏమాత్రం భిన్నం కాద‌ని టాక్ వినిపిస్తోంది.

ట్రిప్తి డిమ్రీ ఇటీవ‌ల ముంబై బాంద్రాలో ఒక ఖ‌రీదైన బంగ్లాను సొంతం చేసుకుంద‌ని తెలిసింది. బాంద్రా వెస్ట్ ఏరియాలోని కార్టర్ రోడ్‌లో గ్రౌండ్ ప్లస్ రెండు అంతస్తుల బంగ్లా కోసం రూ. 14 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఒక్క స్టాంప్ డ్యూటీకే రూ.70 లక్షలు ఖర్చయింది. ఆస్తి 2226 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. జూన్ 3న రిజిస్ట్రేషన్ జరిగింది. సెడ్రిక్ పీటర్ ఫెర్నాండెజ్ - మార్గరెట్ అన్నీ మేరీ ఫెర్నాండెజ్ నుండి ఆస్తిని కొనుగోలు చేసిందని క‌థ‌నాలొస్తున్నాయి. యానిమ‌ల్ విడుద‌లై ఇంకా ఏడాది అయినా కాలేదు. అంత‌కుముందు ఆమె ఎవ‌రో ఎవ‌రికీ తెలీదు. అప్పుడే ఎన్ని అడ్వాన్సులు అందుకుందో కానీ, ఇంత‌లోనే 14 కోట్ల పెట్టుబ‌డితో బంగ్లా కొనేయ‌డం అంటే ఆషామాషీనా? అంటూ ఫ్యాన్స్ గుస‌గుస‌లాడుకుంటున్నారు.