Begin typing your search above and press return to search.

స్టార్‌డమ్‌ కోసం 'యానిమల్‌' చేయలేదు

యానిమల్ సినిమా విడుదలకు ముందు వరకు త్రిప్తి డిమ్రీ గురించి పెద్దగా జనాలకు తెలియదు. ఆమె నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ అవుతున్న ఒక వెబ్‌ సిరీస్‌ లో నటించి మెప్పించింది.

By:  Tupaki Desk   |   16 Dec 2023 10:30 AM GMT
స్టార్‌డమ్‌ కోసం యానిమల్‌ చేయలేదు
X

యానిమల్ సినిమా విడుదలకు ముందు వరకు త్రిప్తి డిమ్రీ గురించి పెద్దగా జనాలకు తెలియదు. ఆమె నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ అవుతున్న ఒక వెబ్‌ సిరీస్‌ లో నటించి మెప్పించింది. అయితే ఆ వెబ్‌ సిరీస్ ఆమెకు పెద్గా గుర్తింపును తెచ్చి పెట్టలేదు. కానీ ఆ వెబ్‌ సిరీస్‌ లో త్రిప్తి నటనను చూసి సందీప్ వంగ పిలిచి మరీ యానిమల్‌ సినిమాలో జోయా పాత్రను ఇచ్చాడు.

సాధారణంగా అలాంటి పాత్రలను హీరోయిన్స్‌ చేసేందుకు వెనుకాడుతారు. మరీ అంత బోల్డ్‌ సన్నివేశాల్లో నటించాలా అంటూ ప్రశ్నిస్తారు. కానీ త్రిప్తి మాత్రం కథ డిమాండ్‌ చేస్తుందని భావించి ఆ సన్నివేశాలు చేసింది. రణబీర్‌ కపూర్ తో చేసిన సన్నివేశాలకు అంతా ఫిదా అయ్యారు.

యానిమల్‌ సినిమాకు ముందు ఆమె ఇన్‌ స్టా ఫాలోవర్స్ 5 లక్షల మంది అయితే ఇప్పుడు ఆమె ఫాలోవర్స్‌ సంఖ్య అయిదు మిలియన్ లకు చేరువ అవుతోంది. యానిమల్‌ సినిమా త్రిప్తి కెరీర్‌ ను ఎంతగా మార్చిందో ఈ లెక్కలు చెబుతున్నాయి అంటూ మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటూ ఉన్నారు.

తాజాగా ఈ అమ్మడు ఒక చిట్‌ చాట్‌ లో... తాను యానిమల్‌ సినిమాను ఏదో స్టార్‌ డమ్‌ కోసమో, గుర్తింపు కోసమో చేయలేదు అంది. కథ విన్న సమయంలో నచ్చింది. తనకు ఆ పాత్ర లో నటించడం ద్వారా నటిగా నిరూపించుకోవచ్చు అనిపించింది. అందుకే యానిమల్‌ సినిమాకు సైన్‌ చేశాను అంది.

యానిమల్‌ సినిమా ద్వారా వచ్చిన, వస్తున్న పేరు మరియు స్టార్‌ డమ్‌ కి ఆనందంగా ఉంది. అయితే నా జీవితమే సినిమాలు కాదు.. నాకు జీవితంలో ఒక భాగం మాత్రమే సినిమాలు. అందుకే నేను సినిమాల కంటే కూడా ఎక్కువగా కుటుంబం మరియు స్నేహితులకు ప్రాముఖ్యత ఇస్తానంటూ త్రిప్తి డిమ్రీ పేర్కొంది.