Begin typing your search above and press return to search.

'ఆషిఖి 3'లో 'యానిమ‌ల్' బ్యూటీ జాక్ పాట్

ఇంత‌లోనే ఇప్పుడు ట్రిప్తీకి మ‌రో అద్భుత‌మైన అవ‌కాశం ద‌క్కింది. బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంఛైజీ ఆషిఖిలో త‌దుప‌రి భాగంలో న‌టించే అవ‌కాశం త‌న‌ను వెతుక్కుంటూ వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   27 Dec 2023 4:08 AM GMT
ఆషిఖి 3లో యానిమ‌ల్ బ్యూటీ జాక్ పాట్
X

సందీప్ వంగా 'యానిమల్' విడుదలకు ముందు ట్రిప్తీ డిమ్రీ ఎవ‌రో ఎవరికీ తెలీదు. అంత‌గా పాపుల‌ర్ న‌టి కానే కాదు. భారతీయ OTT స్పేస్‌లో తెలిసిన న‌టి మాత్ర‌మే. కానీ రణబీర్ కపూర్ నటించిన యానిమ‌ల్ చిత్రం విడుదలైన తర్వాత ఈ బ్యూటీ మాస్‌లో ప్రజాదరణ పొందడమే కాకుండా కొత్త జాతీయ క్రష్‌గా మారింది. యానిమ‌ల్ లో జోయాగా ట్రిప్తీ న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది. ట్రిప్తీకి ర‌క్తి క‌ట్టించే సన్నివేశాలలో రణబీర్‌తో నటించే అవకాశం వచ్చింది.

ఓవ‌ర్ నైట్‌లో సీన్ అంతా మారిపోయింది. ట్రిప్తి దిమ్రీ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. సందీప్ వంగానే తెర‌కెక్కించే త‌దుప‌రి చిత్రం స్పిరిట్ లో ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న అవ‌కాశం ద‌క్కించుకుంద‌ని కూడా టాక్ వినిపిస్తోంది. వ‌రుస‌గా అగ్ర హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలొస్తున్నాయి. టాలీవుడ్ ఇప్ప‌టికే ఈ భామ‌కు గ్రాండ్ వెల్ కం చెప్పేస్తోంద‌ని గుస‌గుస వినిపిస్తోంది.

ఇంత‌లోనే ఇప్పుడు ట్రిప్తీకి మ‌రో అద్భుత‌మైన అవ‌కాశం ద‌క్కింది. బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంఛైజీ ఆషిఖిలో త‌దుప‌రి భాగంలో న‌టించే అవ‌కాశం త‌న‌ను వెతుక్కుంటూ వ‌చ్చింది. ఆషిఖి 3లో కార్తిక్ ఆర్యన్ సరసన ట్రిప్తీ డిమ్రీ సంతకం చేసిందనేది తాజా స‌మాచారం. ఇది 2024లో మోస్ట్ అవైటెడ్ రొమాంటిక్ డ్రామా కానుంది. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహించనున్నారు. ఆషికీ ఫ్రాంచైజీ మూడవ చిత్రంలో కథానాయిక కోసం చాలా కాలం నుండి అన్వేషణ కొనసాగుతోంది. ప‌లువురు భామ‌లు న‌టిస్తార‌ని ప్ర‌చారం కూడా సాగింది. కానీ చివరకు ట్రిప్తీ ఎంపికతో సెర్చ్ ముగిసింది. నిజంగానే ఈ సినిమా ట్రిప్తీ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుందని ఆషిఖి ఫ్రాంఛైజీ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆషిఖి మొదటి చిత్రం 1990లో విడుదలైంది. ఇందులో ఇద్దరు కొత్తవారు నటించారు. ఆ ఇద్ద‌రూ ఓవ‌ర్ నైట్ సెన్సేష‌న్స్ గా మారారు. రాహుల్ రాయ్ - అను అగర్వాల్ జంటకు మంచి పేరొచ్చింది. ఈ సినిమా ఊహించని మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. రెండవ చిత్రం ఆషిఖి 2 చాలా సంవత్సరాల తర్వాత 2013లో వచ్చింది. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్ -శ్రద్ధా కపూర్ జంట‌గా నటించారు. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఇందులో న‌టించిన ఆదిత్య‌, శ్ర‌ద్ధా ఇద్ద‌రి లైఫ్ మారిపోయింది. ముఖ్యంగా శ్ర‌ద్ధా కపూర్ కెరీర్ ఒక్క సారిగా టేకాఫ్ తీసుకుంది. అనంత‌రం స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఆషికీ 3తో ఇప్పుడు ట్రిప్తీ కెరీర్ కూడా అమాంతం మారిపోనుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. కార్తీక్- ట్రిప్తీ మధ్య కెమిస్ట్రీని చూడటం ఆసక్తికరంగా ఉంటుందని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు. పెద్ద తెర‌పై చెల‌రేగి రొమాంటిక్ సీన్స్ లో న‌టించ‌గ‌లిగే ట్రిప్తీ, ల‌వ్ మేకింగ్ సీన్ల‌లో జీవిస్తుంద‌ని కూడా యూత్ ఊహిస్తున్నారు. ట్రిప్తీ చేరిక‌తో ఇప్పుడు ఆషిఖి 3 కి కూడా ఊపొచ్చింద‌ని భావిస్తున్నారు.