బాబి-2 సెకెండ్ లవ్ అతడితోనే!
బాబి-2గా ఫేమస్ అయిన బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రి గురించి పరిచయం అవసరంలేదు
By: Tupaki Desk | 31 Jan 2024 11:28 AM GMTబాబి-2గా ఫేమస్ అయిన బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రి గురించి పరిచయం అవసరంలేదు. అమ్మడు 'యానిమల్' సినిమాతో ఏ రేంజ్లో ఫేమస్ అయిందో తెలిసిందే. తెరపై కనిపించినంత సేపు మెరుపులా మురిపించేసి వెళ్లిపోయింది. దీంతో అమ్మడికి ఇప్పుడు అవకాశాలు అలాగే వరిస్తున్నాయి. బాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ డిమ్రీకి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇదంతా ఒకే మరి.
ఈ బ్యూటీ ఎవరితోనైనా రిలేషన్ షిప్ లో ఉందా? అంటే అమ్మడు సెకెండ్ లవ్ ని కూడా షురూ చేసినట్లు తెలుస్తోంది. హాటల్స్ అండ్ రెస్టారెంట్ బిజినెస్ మ్యాన్ సామ్ మర్చంట్ తో అమ్మడు డీప్ లో లవ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రియుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ అతడితో దిగిన రెండు ఫోటోల్ని ప్రేమ పూర్వకంగా పోస్ట్ చేసింది. ఒకటి త్రో బ్యాక్ పిక్ కాగా..మరొకటి రీసెంట్ గా కలిసి దిగిన ఫోటోని పోస్ట్ చేసి విషెస్ తెలియజేసింది.
దీంతో ఇంతకాలం ఇది ప్రచారంగానే తెరపైకి వచ్చిన వార్త తాజా లీక్ తో ఇద్దరి మధ్య వ్యవహారం నడుస్తోందని తేలిపోయింది. ఇంతకీ ఎవరీ సామ్ మర్చంట్ అంటే? అతడు రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ బిజినెస్ మ్యాన్ అని తెలుస్తోంది. విలాసవంతమైన విఐపీ భవనాలు.. గోవా లో రెస్టారెంట్లు పబ్ లు..క్లబ్ లు ఉన్నట్లు తెలుస్తోంది. సామ్ మర్చంట్ ఈ వ్యాపారకంటే ముందుగా మోడల్‌గా పనిచేశాడు.
అతను ట్రావెల్ బ్లాగర్ కూడా. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. ఇప్పుడు తృప్తి డిమ్రీతో డీప్ లవ్ లో ఉన్నాడు. అయితే తృప్తి ఖాతాలో ఇతను సెకెండ్ బోయ్ ప్రెండ్. అమ్మడు సామ్ మర్చంట్ కంటే ముందు బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ సోదరుడు కర్నేష్ శర్మతో కొన్నాళ్లు డేటింగ్ చేసింది. ఈ విషయాన్ని అధికారికంగానూ ప్రకటించింది. కానీ ఆ బంధం ఎంతో కాలం కొనసాగలేదు. ఇద్దరు ఇన్ స్టా లో అన్ ఫాలో చేసుకోవడంతో బంధం వీగిపోయిందని తేలిపోయింది. అటుపై కొంత గ్యాప్ తర్వాత సామ్ మర్చంట్ కి దగ్గరైంది.