Begin typing your search above and press return to search.

వేడి వేడిగా వ‌డ్డించిన ట్రిప్తి..కునుకు క‌రువే

కైపు క‌ళ్ల‌తో మ‌త్తు చ‌ల్లుతున్న ఈ బ్యూటీ తాజా ఫోటోషూట్ టూ బోల్డ్ గా ఉందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   8 Feb 2024 4:11 AM GMT
వేడి వేడిగా వ‌డ్డించిన ట్రిప్తి..కునుకు క‌రువే
X

యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రీ స్టైల్ కంటెంట్ ఎలివేష‌న్ లో ఇత‌ర భామ‌ల‌తో పోటీప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల అందాల జాత‌ర‌కు తెర తీసిన ఈ భామ అనూహ్యంగా వేడి పెంచిన సంగ‌తి తెలిసిందే. నిజానికి యానిమ‌ల్ రిలీజ‌య్యే వ‌ర‌కూ ఈ అమ్మ‌డు ఎవ‌రో ప్ర‌పంచానికి అంత‌గా తెలీదు. కానీ అనూహ్యంగా ఒకే ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీతో టాప్ ట్రెండింగ్ లోకి రావ‌డ‌మే గాక నేష‌న‌ల్ క్ర‌ష్ గా మారింది. న‌టిగా ఇది నిజంగా స‌ర్ ప్రైజింగ్ ట‌ర్న్ అని చెప్పాలి. ఇక అందివ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకునేందుకు ట్రిప్తి ఇటీవ‌ల‌ తెలివిగా అడుగులు వేస్తోంది. నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో మ‌తి చెడే ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ అగ్గి రాజేస్తోంది.

తాజాగా మ‌రో అసాధార‌ణ ఫోటోషూట్ తో హెడ్ ట‌ర్న‌ర్ గా మారింది ట్రిప్తి. ఈసారి వైట్ బ్లేజ‌ర్ లో అందాల‌ను ఆర‌బోసింది ఈ అమ్మ‌డు. ఇన్న‌ర్ ధ‌రించ‌కుండా బ్లేజ‌ర్ కోట్ తో త‌న అందాల‌ను క‌వ‌ర్ చేస్తూ మ‌తులు చెడ‌గొట్టింది. కైపు క‌ళ్ల‌తో మ‌త్తు చ‌ల్లుతున్న ఈ బ్యూటీ తాజా ఫోటోషూట్ టూ బోల్డ్ గా ఉందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. వీటికి బోయ్స్ నుంచి అద్భుత స్పంద‌న ద‌క్కుతోంది. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో ట్రిప్తికి అమాంతం ఫాలోయింగ్ పెర‌గ‌డంతో తాజా ఫోటోషూట్ దావాన‌లంలా దహించివేస్తోంది.

పెళ్లి ప్లాన్స్ ఇప్ప‌ట్లో లేవ్:

త్వ‌ర‌లోనే ట్రిప్తి దిమ్రీ పెళ్లి చేసుకుంటోందంటూ ఒక పుకార్ ఇటీవ‌ల షికార్ చేస్తోంది. అయితే దీనిపై త‌న‌నే ప్ర‌శ్నిస్తే ఆస‌క్తిక‌రంగా స్పందించింది. తాజా ఇంటర్వ్యూలో త్రిప్తిని మీడియా ప్ర‌తినిధి ఒక‌రు పెళ్లి గురించి అడిగారు. ఇప్పటికిప్పుడు తన పెళ్లి గురించి ఆలోచించడం లేదని, కెరీర్‌ను నిర్మించుకోవడంపైనే దృష్టి పెడుతున్నానని ట్రిప్తి చాలా సూటిగా చెప్పింది.

కాబోయే భర్త నుంచి ఏం కోరుకుంటారు? అని ప్ర‌శ్నించ‌గా.. త్రిప్తి ఇలా చెప్పింది "అతడు మంచి మనిషిగా మాత్రమే ఉండాలని నేను కోరుకుంటున్నాను. డబ్బు, కీర్తి దాంతో పాటే అనుసరిస్తాయి" అని తెలిపింది. చాలా మందికి తెలియని విష‌యం ఏమంటే, గత కొన్ని నెలలుగా గూగుల్ లో అత్య‌ధికంగా శోధించ‌బ‌డిన‌ వ్యక్తులలో ట్రిప్తి ఒకరు. ఇటీవ‌ల త్రిప్తిని వ‌రుస‌గా ఆఫర్ లు వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. త‌దుప‌రి ప్ర‌భాస్ స్పిరిట్ లోను ట్రిప్తి న‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇప్పటికే హిందీలో కొన్ని ప్రాజెక్ట్‌లకు సంతకం చేసిందని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం.