Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : 'యానిమల్‌' బ్యూటీ అందాల ఊచకోత

వైట్ డ్రెస్ లో క్లీ వేజ్ అందాల ఆరబోత చేస్తూ కవ్వించేలా చూస్తూ మతి పోగొడుతుంది.

By:  Tupaki Desk   |   20 Jan 2024 9:30 AM GMT
పిక్ టాక్‌ : యానిమల్‌ బ్యూటీ అందాల ఊచకోత
X

రణబీర్‌ కపూర్‌ హీరోగా వచ్చిన యానిమల్ సినిమాలో హీరోయిన్‌ గా నటించిన రష్మిక మందన్నా కంటే కూడా కీలక పాత్రలో నటించిన తృప్తి డిమ్రి కి మంచి మార్కులు పడ్డాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్‌ మీడియాలో తృప్తి క్రేజ్ ఏంటో ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపితం అయ్యింది.


యానిమల్‌ సినిమాకు ముందు పెద్దగా తెలియని తృప్తి డిమ్రి ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులకు సుపరిచితురాలు. అందుకే ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ మ్యాగజైన్స్‌ కవర్స్ పై కూడా అప్పుడే సందడి మొదలు పెట్టింది. తాజాగా హలో మ్యాగజైన్‌ కవర్‌ పై తృప్తి డిమ్రి మెరిసింది.


హలో కవర్‌ పై ఈ అమ్మడి అందంకు ఎంతటి వారు అయినా కూడా ఫిదా అవ్వాల్సిందే అన్నట్లుగా ఉంది. వైట్ డ్రెస్ లో క్లీ వేజ్ అందాల ఆరబోత చేస్తూ కవ్వించేలా చూస్తూ మతి పోగొడుతుంది. ఈ అందం ముందు ఎంతటి అందం అయినా కూడా దిగదుడుపే అన్నట్లుగా కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి అందాల ఊచకోత గురించి తెగ మాట్లాడుకుంటూ ఉన్నారు.

యానిమల్ సినిమాలో ఆమె పాత్రకు వచ్చిన ప్రశంసలు అంతా ఇంతా కాదు. యానిమల్‌ సినిమా తర్వాత ఆమె కెరీర్ ఒక్కసారిగా యూ టర్న్‌ తీసుకుంది. ప్రస్తుతం ఆమె చేతి నిండా సినిమాలు ఉన్నాయని, రాబోయే కాలంలో కాబోయే స్టార్‌ హీరోయిన్‌ అంటూ తృప్తి డిమ్రి గురించి నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.