ఫోటోటాక్ : నల్ల కలువ అవతార్‌లో త్రిప్తి
'యానిమల్' సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన త్రిప్తి డిమ్రి గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల్లో నటించింది.
By: Tupaki Desk | 22 March 2025 6:45 AM IST'యానిమల్' సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన త్రిప్తి డిమ్రి గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల్లో నటించింది. ముఖ్యంగా ఈమె నటించిన భూల్ భులయ్యా 3 సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే యానిమల్ సినిమాలో ఓవర్ డోస్ శృంగార సన్నివేశాల్లో నటించి గుర్తింపు దక్కించుకోవడం వల్ల అన్ని సినిమాల్లోనూ అలాంటి పాత్రల్లో నటించే అవకాశాలు వస్తున్నాయట. దాంతో త్రిప్తి సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. ఇటీవల ఒక స్టార్ హీరో సినిమాలో త్రిప్తి హీరోయిన్‌గా ఎంపిక అయి, ఆమెకు ఉన్న ఇమేజ్ కారణంగా తప్పించారనే వార్తలు వస్తున్నాయి. త్రిప్తి ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తోంది.
ధడక్ 2 సినిమాతో పాటు ఇంకా టైటిల్ ఖరారు కానీ మరో సినిమాలోనూ త్రిప్తి ప్రస్తుతం నటిస్తోంది. ఆ రెండు సినిమాలతో ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సందడికి సిద్ధం అవుతున్న త్రిప్తి తనపై ఉన్న ఇమేజ్‌ను తొలగించుకునే ప్రయత్నాలు చేస్తుంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు వస్తే తప్పకుండా మెప్పిస్తాను అనే నమ్మకంతో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చింది. సినిమాల్లో అందాల తారగా కంటే ఉత్తమ నటిగా గుర్తింపు దక్కించుకోవడం కోసం ఎదురు చూస్తున్నట్లు త్రిప్తి చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఈమె సౌత్ సినిమాల్లోనూ నటించేందుకు రెడీ అంటూ ఒక ఇంటర్వ్యూలో ఓపెన్‌గానే చెప్పుకొచ్చింది.
సినిమాల్లో బిజీ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేయడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా మరోసారి త్రిప్తి బ్లాక్ డ్రెస్‌లో సర్‌ప్రైజ్ చేసింది. పెద్దగా స్కిన్ షో చేయకుండానే స్టైలిష్ లుక్‌లో త్రిప్తి ఆకట్టుకుంది. బ్లాక్ డ్రెస్‌లో చూపు తిప్పనివ్వడం లేదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్‌లో అందంగా ఉన్న త్రిప్తిని వెండి తెరపై శృంగార తార పాత్రలో చూసేందుకు ఎక్కువ శాతం మంది ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఫిల్మ్ మేకర్స్ సైతం అదే విధంగా ఆమెను చూపించాలని భావిస్తున్నారు. కానీ త్రిప్తి మాత్రం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేసేందుకు ఎదురు చూస్తుంది.
సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా బాలీవుడ్‌లోనే కాకుండా సౌత్‌లోనూ ఈ అమ్మడు సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకుంటుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యానిమల్ సినిమా విడుదలైన వెంటనే ఒక సౌత్ సినిమాలో ఈమెకు ఆఫర్ వచ్చిందనే టాక్ వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. త్వరలోనే సౌత్‌లో ఈమె నటిస్తుందేమో చూడాలి. యానిమల్ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న యానిమల్ పార్క్‌లో ఈమె పాత్ర ఏమైనా ఉండే అవకాశం ఉందా అంటూ పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.