Begin typing your search above and press return to search.

యానిమ‌ల్ బ్యూటీ పూల్ సైడ్ రొమాన్స్

'యానిమల్‌'లో న‌ట‌న‌కు ప్రజాదరణ పొందినప్పటి నుండి అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో ట్రిప్తీ పేరు చర్చనీయాంశమైంది

By:  Tupaki Desk   |   8 July 2024 4:11 AM GMT
యానిమ‌ల్ బ్యూటీ పూల్ సైడ్ రొమాన్స్
X

'యానిమ‌ల్' చిత్రంతో ట్రిప్తి దిమ్రీ ఫేట్ ఓవ‌ర్‌నైట్‌ మారిపోయింది. 'యానిమల్‌'లో న‌ట‌న‌కు ప్రజాదరణ పొందినప్పటి నుండి అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో ట్రిప్తీ పేరు చర్చనీయాంశమైంది. ఈ విజ‌యం త‌ర్వాత నేష‌న‌ల్ క్ర‌ష్ గా వెలిగిపోతోంది. త‌దుప‌రి వ‌రుస‌గా క్రేజీ చిత్రాల్లో న‌టిస్తూ ట్రిప్తి బిజీ స్టార్ గా మారింది. ఈ భామ‌ త‌దుప‌రి విక్కీ కౌశల్, అమీ విర్క్ ల‌తో క‌లిసి 'బాడ్ న్యూజ్'లో న‌టించింది. ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుద‌లై మాస్ క్లాస్ వ‌ర్గాల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.

ట్రైల‌ర్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే పాత్ర‌తో మెస్మ‌రైజ్ చేసింది ట్రిప్తి. బాడ్ న్యూజ్ ట్రైలర్ లో జెన్-జెడ్ బి-టౌన్ బ్యూటీ లుక్ గురించి చాలా చ‌ర్చించుకుంది యూత్. ఇప్పుడు ఇదే సినిమా నుంచి సింగిల్స్ విడుద‌ల కానున్నాయి.

తాజాగా ఈ మూవీ నుంచి 'జాన‌మ్..' అంటూ సాగే పాట‌ను జూలై 9న‌ విడుద‌ల చేయ‌నున్నారు. ఇదే విష‌యాన్ని రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన తాజా పోస్ట‌ర్ వైర‌ల్ గా దూసుకెళుతోంది. ఈ పోస్ట‌ర్ లో విక్కీతో ట్రిప్తి రొమాంటిక్ ఫోజ్ గిలిగింత‌లు పెడుతోంది. పూల్ లో ట్రిప్తి బికినీలో క‌నిపించ‌గా, త‌న‌తో రొమాన్స్ లో బిజీగా ఉన్న విక్కీ కౌశ‌ల్ ఫోజ్ అగ్గి రాజేస్తోంది. ట్రిప్తీ సెన్సిటివ్‌ షిమ్మర్ డ్రెస్ లో హాట్‌గా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

బాడ్ న్యూజ్ వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొందిన అరుదైన కామెడీ చిత్రం. అరుదైన గర్భధారణకు సంబంధించిన ఒక స‌మ‌స్య‌ను తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. హెటెరోపాటర్నల్ సూపర్‌ఫెకండేషన్ అనేది ఈ మూవీలో పెద్ద ట్విస్ట్. పాత్ర‌ల న‌డుమ హాస్యానికి ఇది ప్ర‌ధాన కార‌ణం. సలోని (ట్రిప్తి డిమ్రీ పోషించినది) ఇద్దరికి.. అంటే అఖిల్ (విక్కీ కౌశల్ పోషించిన పాత్ర) .. గుర్బీర్ (అమీ విర్క్ పోషించిన)ల ద్వారా కవలలకు గర్భవతి అని వైద్యులు కనుగొన్న త‌ర్వాత ఏం జరిగింద‌న్న‌ది తెర‌పైనే చూడాలి. ఈ అనూహ్య స‌న్నివేశం అనంత‌రం బ్రేక‌ప్ సీన్.. హృదయాన్ని కదిలించే సంఘటనలకు కార‌ణ‌మ‌వుతుంది. ఈ సంఘ‌ర్ష‌ణ‌ మరపురాని సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తుంది. ఈ చిత్రం ప్ర‌తి మ‌నిషికి ఒక ప్రశ్నను సంధిస్తుంది. జీవితం మీకు బిలియన్‌లో ఒకటి మాత్ర‌మే ఇలా జ‌రుగుతుంది! అనే ట్యాగ్ లైన్‌తో చిత్ర‌బృందం ప్ర‌చారం హోరెత్తిస్తోంది. హిరూ యష్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అమృతపాల్ సింగ్ బింద్రా , ఆనంద్ తివారీ నిర్మించిన బాడ్ న్యూజ్ జూలై 19న థియేటర్లలో విడుదల కానుంది.