గోల్డెన్ డిజైన్ లో త్రిప్తి తృప్తిపరిచేలా!
బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ ఇప్పుడో సంచలనం. పాన్ ఇండియాలో అమ్మడి క్రేజ్ మామూలుగా లేదు
By: Tupaki Desk | 6 July 2024 11:30 AM GMTబాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ ఇప్పుడో సంచలనం. పాన్ ఇండియాలో అమ్మడి క్రేజ్ మామూలుగా లేదు. ఒక్క హిట్ తో లైఫ్ టర్న్ అయిపోయింది. బాలీవుడ్ లో బిజీ నటీమణిగా మారిపోయింది. ఒకే ఏడాది నాలుగైదు సినిమాలు చేసే స్థాయికి రీచ్ అయింది. అంతా యానమిల్ పుణ్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందులో అమ్మడు ఇంటిమేట్ సన్నివేశాల్లో హద్దులు చెరిపేసి చెలరేగడంతోనే ఆ రేంజ్ లో ఫేమస్ అయిందన్నది తెలిసిన వాస్తవం.
అప్పటి నుంచి ఇన్ స్టాలో క్రేజ్ రెట్టింపు అయింది. త్రిప్తీ నుంచి ఎలాంటి ఫోటోలు రిలీజ్ అయినా నిమిషాల్లో వైరల్ అవుతున్నాయి. కొత్త కొత్త ఫోటోలతో హీటెక్కించడంలో అంతే చొరవ చూపుతుంది. అయితే ఆ స్పీడ్ సరిపోదు. ఇన్ స్టా కాంపిటీషన్ లో దూసుకుపోవాలంటే మరింత స్పీడ్ గా ఉంటే తప్ప పనవ్వదు. ఈ నేపథ్యంలో ఇంకొంచెం స్పీడ్ పెంచాలంటూ అమె అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా మరో హాట్ ఫోటోతో నెటిజనుల ముందుకొచ్చింది. అమ్మడు ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన గోల్డెన్ కలర్ దుస్తులలో స్టైల్‌గా మురిపించింది. సిజ్లింగ్ దుస్తుల్లో మెరుపుల బాణాలు విసిరింది. ఓవైపు స్కిన్ షో ..మరోవైపు వలపు బాణంతో చూపరులను ఆకర్షిస్తుంది. స్పాట్ లైట్ లో త్రిప్తి అందానికి కుర్రాళ్లు అంతే ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఆమె ఫాలోవర్లు హాట్ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
ఇక అమ్మడు నటించిన `బ్యాడ్ న్యూజ్` సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది. సినిమా ప్రమోషన్ లో చురుకుగా పాల్గొంటుంది. ఎక్కడికెళ్లినా త్రిప్తి అభిమానులు చూడటానికి గుమ్మి గూడుతున్నారు. అభిమానుల ఆరాటం చూసి త్రిప్తి కూడా అంతే సంతోష పడుతోంది. ఏ నటికైనా కావాల్సింది ఈ రకమైన ఆదరణే కదా అంటూ సంతోషం వ్యక్తం చేసింది.