Begin typing your search above and press return to search.

ఫ్రాక్‌లో మ‌తులు చెడ‌గొడుతున్న ట్రిప్తి

మ‌రోవైపు ఫ‌ర్హాన్ అఖ్త‌ర్, ర‌ణ్ వీర్ సింగ్ కాంబినేష‌న్ మూవీ డాన్ 3లోను ట్రిప్తి న‌టించ‌నుంద‌ని న‌టిస్తోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

By:  Tupaki Desk   |   25 Feb 2024 7:19 AM GMT
ఫ్రాక్‌లో మ‌తులు చెడ‌గొడుతున్న ట్రిప్తి
X

'యానిమల్` తర్వాత ట్రిప్తి దిమ్రీ వ‌రుస సినిమాల‌కు సంత‌కాలు చేస్తోంది. ప్ర‌భాస్ స‌ర‌స‌న `స్పిరిట్`లో న‌టించేందుకు ఆస్కారం ఉంద‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ అధికారికంగా ధృవీక‌రించాల్సి ఉంది. ఇప్ప‌టికే విక్కీ కౌశల్ సరసన మేరే మెహబూబ్ మేరే సనమ్, రాజ్‌కుమార్ రావుతో - విక్కీ విద్యా కా వో వాలా .. కార్తీక్ ఆర్యన్ తో- భూల్ భూలయ్యా 3, ఆషిఖి 3 చిత్రాల్లో న‌టించ‌నుంది. మ‌రోవైపు ఫ‌ర్హాన్ అఖ్త‌ర్, ర‌ణ్ వీర్ సింగ్ కాంబినేష‌న్ మూవీ డాన్ 3లోను ట్రిప్తి న‌టించ‌నుంద‌ని న‌టిస్తోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.


వ‌రుస‌గా భారీ ఆఫ‌ర్లు అందుకుంటున్న ట్రిప్తికి గుడ్ టైమ్ న‌డుస్తోంది. ఇదే అద‌నుగా ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాల్లో భారీ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇంత‌కుముందే ట్రిప్తి హాటెస్ట్ ఫోటోషూట్ ఒక‌టి అంత‌ర్జాలంలో గుబులు రేపింది. ఇప్పుడు మ‌రో స్పెషల్ ఫోటోషూట్ తో గుండెల్ని కొల్ల‌గొడుతోంది. ట్రిప్తి వైట్ అండ్ సిమెంట్ క‌ల‌ర్ డిజైన‌ర్ ఫ్రాకులో అందంగా ఫోజులిచ్చిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. ఈ స్పెష‌ల్ డిజైన‌ర్ ఫ్రాక్ ఎద అందాల‌ను ఆరాంగా ఆవిష్క‌రిస్తోంది. ఇక ఈ ఫ్రాక్ కోసం కెంపులు, ముత్యాలు పొదిగిన‌ అంద‌మైన ఎంబ్రాయిడ‌రీ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.


ట్రిప్టి డిమ్రీ 30వ పుట్టినరోజు

ట్రిప్తి నేటితో మూడు ప‌దుల వ‌య‌సులో అడుగుపెట్టింది. ఈ సంద‌ర్భంగా త‌న కుటుంబం, ప్రియమైనవారు శ్రేయోభిలాషుల స‌మ‌క్షంలో బ‌ర్త్ డే వేడుక‌లు జ‌రుపుకుంది. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవలసిన పుట్టినరోజు. అందరి ప్రేమ ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు అంటూ మురిసిపోయింది ట్రిప్తి. ప్ర‌స్తుతం త‌న కుటుంబంతో సెల‌బ్రేష‌న్ కి సంబంధించిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి.