Begin typing your search above and press return to search.

కాలేజ్ వ‌య‌సులోనే మ‌హేష్‌తో ప‌రిచ‌యం

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబుపై త్రిష‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

By:  Tupaki Desk   |   18 Sep 2024 10:30 PM GMT
కాలేజ్ వ‌య‌సులోనే మ‌హేష్‌తో ప‌రిచ‌యం
X

మ‌హేష్ బాబు- త్రిష జంట‌గా న‌టించిన `అత‌డు` అభిమానుల‌కు ఆల్ టైమ్ ఫేవ‌రెట్ మూవీ. కామెడీ, మ్యూజిక్, రొమాన్స్, యాక్ష‌న్ అన్నీ స‌మ‌పాళ్ల‌లో కుదిరిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోయినా కానీ, బుల్లితెర‌పై బంప‌ర్ టీఆర్పీల‌తో ఎప్పుడూ ఆక‌ట్టుకుంటూనే ఉంటుంది. ఈ సినిమాలో త్రిష ప‌ల్లెటూరి అల్ల‌రి అమ్మాయిగా న‌టించింది. అలాగే మ‌హేష్ తో సైనికుడు చిత్రంలోను ఆడిపాడింది. కానీ ఆ త‌ర్వాత మ‌రో సినిమా క‌లిసి చేయ‌లేదు. ఆన్ స్క్రీన్ త్రిష‌తో మ‌హేష్ రొమాన్స్ ఒక రేంజులో వ‌ర్క‌వుటైనా కానీ, ఎందుక‌నో మ‌ళ్లీ క‌ల‌వ‌లేదు వీళ్లు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబుపై త్రిష‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహేష్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? అని హోస్ట్ ప్ర‌శ్నించ‌గా, అత‌డు ఇష్టమైన నటులలో ఒకరు అని తెలిపింది. అంత పెద్ద సూపర్‌స్టార్‌ అయినప్పటికీ అతను చాలా గౌరవంగా ఉంటాడు. చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. మహేష్ బాబు న‌ట‌న‌లోకి రాక ముందునుంచే నాకు తెలుసు. కాలేజీ రోజుల్లో మహేష్ బాబు చెన్నైలో ఉండేవాడని ప‌రస్ప‌ర స్నేహితుల ద్వారా ఆమెకు మహేష్ పరిచయం ఏర్పడింద‌ని వెల్ల‌డించింది. అప్ప‌టికి నటులు అవుతారని వారికి తెలియదట‌. షూటింగ్ కోసం మహేష్ చాలా కష్టపడతాడు. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు షూటింగ్‌లో పాల్గొంటాడు. అతని కష్టానికి గిల్టీగా అనిపించింది. కారవాన్ లోకి కూడా వెళ్లడు. తాను, కమెడియన్లు, ఎవరైనా నటించిన ప్రతి సన్నివేశాన్ని మహేష్ మానిటర్ ముందు కూర్చుని గమనిస్తాడని త్రిష చెప్పింది.

త్రిష ఇటీవ‌ల టాలీవుడ్ సినిమాకి సంత‌కం చేసింది. తెలుగులో విశ్వంబర చిత్రంలో చిరంజీవి సరసన నటిస్తోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే చిత్ర‌మిది. దాదాపు 17 ఏళ్ల తర్వాత త్రిష-చిరంజీవి కలిసి నటిస్తున్నారు. వీరిద్దరూ గతంలో స్టాలిన్ చిత్రంలో కలిసి నటించారు. విశ్వంభ‌ర 10 జ‌నవరి 2025న విడుదల కానుంది. దీనిని పాన్ ఇండియా చిత్రంగా పలు భాషల్లో విడుదల చేయ‌నున్నారు. మ‌హేష్‌- రాజ‌మౌళి సినిమా కూడా ప‌ట్టాలెక్కేందుకు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నారు. తొలి దశ షూటింగ్ జర్మనీలో ప్రారంభం కానుందని సమాచారం. కథ ఎక్కువగా అడవిలో సాగుతుందని ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ అని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో అరుదైన గిరిజన జాతికి సంబంధించిన ప్రస్తావనలు ఉంటాయని, దీని కోసం టీమ్ స్కెచ్ వేస్తోందని, త్వరలోనే కాస్ట్యూమ్స్ ఖరారు చేస్తార‌ని కూడా తెలుస్తోంది. ఇప్ప‌టికే వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు షూట్ ప్రారంభానికి ముందే తమ లుక్‌ను ఖరారు చేసేందుకు లుక్ టెస్టుల్లో పాల్గొంటున్నార‌ని, న‌ట‌న ప‌రంగా శిక్షణ పొందుతున్నారని స‌మాచారం.