Begin typing your search above and press return to search.

ఆ కేసులో త్రిష రాజీ కొచ్చిందిలా!

ఎట్ట‌కేల‌కు త్రిష గోడ వివాదం ముగిసిందా? మద్రాస్ హైకోర్టు ఈవివాదానికి ముగింపు ప‌లికిందా? అంటే అవున‌నే తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   26 Sep 2024 9:30 PM GMT
ఆ కేసులో త్రిష రాజీ కొచ్చిందిలా!
X

ఎట్ట‌కేల‌కు త్రిష గోడ వివాదం ముగిసిందా? మద్రాస్ హైకోర్టు ఈవివాదానికి ముగింపు ప‌లికిందా? అంటే అవున‌నే తెలుస్తోంది. చెన్నైలోని సేనాడ్ డోప్ రోడ్లో ఉన్న త్రిషకి ఆ ప‌క్కింటి వారితో కాంపాండ్ వాల్ విష‌యంలో వివాదం త‌లెత్తిన సంగ‌తి తెలిసిందే. ఏడాది కాలంగా ఈ వివాదం న‌డుస్తోంది. త్రిష కాంపౌం డ్ వాల్ కూల్చ‌కూడ‌ద‌ని, కాదు కూల్చాల‌ని ప‌క్కింటి వారి మ‌ధ్య మొద‌లైన రాద్దాంతం చివ‌రికి సెటిల్ మెంట్ అయిన‌ట్లు తెలుస్తోంది.

వివ‌రాల్లోకి వెళ్తే... త్రిష‌ పొరుగింటి వాళ్ళు తన ఇంటి భవనాన్ని ప్రభావితం చేసేలా కాంపౌండ్ వాల్‌ను కూల్చివేసి కొత్త ఇంటి నిర్మాణ పనులు చేపట్టకుండా ఆపాలంటూ నైబర్ మెయ్యప్పన్‌ పై త్రిష చెన్నై కోర్టులో కేసు వేసింది. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు కాంపౌండ్ వాల్‌ను కూల్చి వేయరాదని ఆదేశించింది. అప్ప‌టి నుంచి ఏడాది కాలంగా కేసు న‌డుస్తోంది. ఈనేప‌థ్యంలో తాజాగా ఇరువురు రాజీ ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

మెయ్యప్పన్ భార్య కావేరి, వారి న్యాయవాది సంతకం చేసిన జాయింట్ సెటిల్ మెంట్ మెమోరాండంను కోర్టులో దాఖలు చేయడంతో కేసును ముగించారు. దీంతో త్రిష కట్టిన కోర్టు ఫీజు రీఫండ్‌ చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. అలాగే త్రిష దాఖలు చేసిన కేసును మూసివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇరువురు సామ‌రస్యంగా ప‌రిష్క‌రించుకోవ‌డంతో కేసు తేలింది.

ఆ ఇంటిని త్రిష 2005 లో కొన‌గా.. పొరుగు వారు 2023లో ఆ ప‌క్క ఇల్లు కొన్నారు. మ‌ధ్య‌లో గొడ‌ని పాత ఓన‌ర్లు ఒప్పంద ప్రాతి ప‌దికన నిర్మించారు. ఆ త‌ర్వాత మాజీ య‌జ‌మానులు ఇళ్లు అమ్మేసి వెళ్లిపోయారు. దీంతో ఆ రెండుళ్లు కొన్న వాళ్లిద్ద‌రు ఇలా కోర్టు మెట్లు ఎక్కారు .అదీ మ్యాట‌ర్.