పండగ పూట త్రిష ఇంట విషాదం
నేడు తెల్లవారుజామున నా కొడుకు జొర్రో చనిపోయాడు. నా గురించి బాగా తెలిసిన వారికి, నా సన్నిహితులకు, స్నేహితులకు నా జీవితంలో జొర్రోకి ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో తెలుసు.
By: Tupaki Desk | 25 Dec 2024 11:26 AM GMTటాలీవుడ్, కోలీవుడ్‌లో టాప్ స్టార్ హీరోయిన్‌గా దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ముద్దుగుమ్మ త్రిష. ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లు అవుతున్నా స్టార్ హీరోలకు ముఖ్యంగా సీనియర్ స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా వరుసగా సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమా విశ్వంభరలో నటిస్తున్న విషయం తెల్సిందే. అంతే కాకుండా కోలీవుడ్‌లో పలువురు సీనియర్ స్టార్ హీరోలకు జోడీగా నటించడం ద్వారా చాలా బిజీగా ఉంది. త్రిష ఎప్పుడూ సినిమాల కారణంగా వార్తల్లో ఉండేది. కానీ ఈసారి ఇంట్లో జరిగిన విషాద ఘటన వల్ల వార్తల్లో నిలిచింది.
నేడు తెల్లవారుజామున నా కొడుకు జొర్రో చనిపోయాడు. నా గురించి బాగా తెలిసిన వారికి, నా సన్నిహితులకు, స్నేహితులకు నా జీవితంలో జొర్రోకి ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో తెలుసు. జొర్రో నాకు ఎంత ముఖ్యమో చాలా మందికి తెలుసు. అలాంటి జొర్రో నా ఫ్యామిలీని వదిలి వెళ్లి పోయాడు. నేను నా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు బాధలో ఉన్నాం. ఈ బాధ నుంచి బయటకు వచ్చేందుకు కొన్ని రోజుల సమయం పడుతుంది. అప్పటి వరకు తాను అందుబాటులో ఉండను అంటూ సోషల్ మీడియా ద్వారా త్రిష ఒక పోస్ట్ ను షేర్ చేసింది. పండుగ రోజు ఇలాంటి విషాదం చోటు చేసుకోవడంతో ఆమె ఫ్యాన్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జొర్రో అనేది త్రిష, ఆమె కుటుంబ సభ్యుల పెంపుడు కుక్క. దాన్ని ఒక కుక్క మాదిరిగా కాకుండా ఇంట్లో ఒక పిల్లాడిగా చూస్తారు. ఎన్నో సార్లు జొర్రోతో ఉన్న ఫోటోలను త్రిష షేర్ చేసింది. ఒక కొడుకు మాదిరిగా దన్ని చూసుకుంటూ ఉండేది. అలాంటి ఇంటి సభ్యుడు చనిపోయినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జొర్రో ఏ కారణంతో చనిపోయింది అనే విషయాన్ని క్లారిటీగా చెప్పకున్నా త్రిష తన బాధను వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంట్లో వ్యక్తి చనిపోయిన సమయంలో ఉండే బాధ ఎంతో ప్రేమగా పెంచుకున్న జంతువు చనిపోయినప్పుడూ ఉంటుంది.
త్రిష వరుసగా సినిమాలు చేస్తూ మంచి జోష్ మీద ఉన్న ఇలాంటి సమయంలో ఈ విషాద సంఘటన జరగడం దారుణం. ఆమె మాటలతో జొర్రో ఆమెకి ఎంత కీలకమో అర్థం అవుతుంది. అందుకే సోషల్ మీడియా ద్వారా చాలా మంది ఆమెకు సానుభూతి తెలియజేస్తూ ఈ సమయంలో ధైర్యంగా ఉండాలంటూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. కొందరు మాత్రం పెంపుడు జంతువు చనిపోయినా ఇంతగా బాధ పడుతారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. త్రిష మంచి మనసుకు ఎంతో మంది ఫిదా అవుతున్నారు.