త్రిషకు టాలీవుడ్ చేదు అయ్యింది ఎందుకు..?
సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ రెండు దశాబ్దాల కెరీర్ తర్వాత కూడా ఇప్పటికీ కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది.
By: Tupaki Desk | 24 Jan 2025 7:30 AM GMTసౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ రెండు దశాబ్దాల కెరీర్ తర్వాత కూడా ఇప్పటికీ కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. తమిళ్ లో స్టార్ హీరోలందరితో నటించిన ఈ అమ్మడు మధ్యలో కొంత వెనకపడినట్టు అనిపించినా 96 సినిమాతో హిట్ కొట్టి తిరిగి ఫాంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఇక వరుస సినిమాలతో వాటి ఫలితాలతో సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగిస్తుంది త్రిష. లాస్ట్ ఇయర్ దళపతి విజయ్ తో గోట్ సినిమాలో నటించిన త్రిష ప్రస్తుతం తమిళ్ లో 3 సినిమాలు తెలుగులో ఒక సినిమా మలయాళంలో ఒక సినిమా చేస్తుంది.
తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర సినిమాలో నటిస్తుంది త్రిష. వశిష్ఠ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు. విశ్వంభర తో పాటు తమిళ్ లో విడామయుర్చీ, గుడ్ బ్యాడ్ అగ్లీ, థగ్ లైఫ్, సూర్య 45 ఇలా వరుస సినిమాలు చేస్తుంది త్రిష. ఈ ఇయర్ అన్ని అనుకున్నట్టుగా జరిగితే తెలుగులో విశ్వంభరతో పాటు తమిళ్ లో మూడు సినిమాల దాకా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
సో ఈ సినిమాలతో త్రిష మరోసారి తన సత్తా చాటనుంది. ఐతే విశ్వంభర లో నటిస్తున్న త్రిషకు ఒకటి రెండు తెలుగు సినిమా ఆఫర్లు వచ్చినా కూడా నో అనేసిందట. తమిళ్ లో బిజీ కాబట్టి ఇక్కడ సినిమాలు చేయడం కష్టమనే భావన ఒకటైతే తెలుగులో కేవలం కమర్షియల్ సినిమా ఆఫర్లే వస్తుండటం వల్ల త్రిషకు ఇక్కడ సినిమాలు చేసే ఉద్దేశం లేదన్నట్టు తెలుస్తుంది
ఒకప్పుడు తెలుగులో కూడా త్రిష స్టార్స్ అందరితో నటించి క్రేజ్ తెచ్చుకుంది. కానీ ఇప్పుడు త్రిష అందుకు సిద్ధంగా లేదన్నట్టు తెలుస్తుంది. విశ్వంభర సినిమా పూర్తి చేశాక మరి అమ్మడు మనసు ఏమైనా మార్చుకుని తెలుగు సినిమాలు చేస్తుందేమో చూడాలి. త్రిష తెలుగు ఫ్యాన్స్ ఆమె వరుస సినిమాలు చేస్తే చూడాలని కోరుతున్నారు. తెలుగు, తమిళ్ లోనే కాదు మలయాళం లో కూడా త్రిష రామ్ అనే సినిమా చేస్తుంది. సౌత్ క్వీన్ గా దాదాపు 20 ఏళ్లుగా స్టార్ క్రేజ్ కొనసాగిస్తున్న త్రిష ఇప్పటికీ అదే దూకుడు చూపిస్తుంది. రాబోతున్న సినిమాలతో మళ్లీ అమ్మడు ఫుల్ బిజీ అవ్వనుంది.