త్రిష సెకెండ్ ఇన్నింగ్స్ చాలా డిఫరెంట్!
ఇప్పటికే పలువురు సీనియర్ హీరోలతో సినిమాల్లో నటిస్తున్న త్రిష తాజాగా మరో బిగ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.
By: Tupaki Desk | 21 Nov 2024 6:30 AM GMTసినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా పది, పదిహేను ఏళ్లు కొనసాగడమే గొప్ప విషయం అనుకుంటున్న ఈ సమయంలో అందాల త్రిష గత పాతిక సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. ఆమె ఏదో చిన్నా చితకా సినిమాలు చేయకుండా స్టార్ హీరోయిన్‌గా సుదీర్ఘ కాలంగా తన ఇమేజ్‌ను కాపాడుకుంటూ వస్తోంది. ఆ మధ్య కేవలం లేడీ ఓరియంటెడ్ సినిమాలకే పరిమితం అయిన త్రిష మళ్లీ స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ స్టార్ హీరోలు వరుసగా త్రిషతో సినిమాలు చేస్తున్నారు, మరికొందరు చేసేందుకు క్యూలో ఉన్నారు. విజయ్‌తో మొదలుకుని చిరంజీవి, అజిత్, కమల్ హాసన్, సూర్య ఇలా ఎంతో మంది సీనియర్‌లు త్రిషతో సినిమాలు చేశారు, చేస్తున్నారు.
ఈమధ్య కాలంలో త్రిష సీనియర్ స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. చిరంజీవి విశ్వంభర సినిమాలో త్రిష నటించింది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవితో త్రిష నటించింది. విజయ్‌తోనూ చాలా ఏళ్ల తర్వాత త్రిష నటించిన విషయం తెల్సిందే. అజిత్‌తోనూ గతంలో నటించిన త్రిష చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఒకే సారి రెండు సినిమాలను ఆయనతో చేస్తున్న విషయం తెల్సిందే. మొత్తానికి త్రిష సీనియర్ హీరోలకు ఒక బెస్ట్ ఛాయిస్‌గా మారింది అంటూ పలువురు సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే పలువురు సీనియర్ హీరోలతో సినిమాల్లో నటిస్తున్న త్రిష తాజాగా మరో బిగ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఇటీవల కంగువా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో సూర్య త్వరలో ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇటీవల దర్శకుడు బాలాజీ సినిమా కోసం హీరోయిన్‌గా త్రిషతో చర్చలు జరిపాడనే వార్తలు వస్తున్నాయి. సూర్యతో దాదాపు 20 ఏళ్ల క్రితం 'ఆరు' సినిమాలో త్రిష నటించింది. ఆ సినిమాలో ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి ప్రేక్షకులను అలరించారు. సినిమా కమర్షియల్‌గా నిరాశ పరచినా ఇద్దరి కాంబోకి మంచి పేరు వచ్చింది.
కొన్ని కారణాల వల్ల ఇన్నాళ్లు వీరి కాంబో మూవీ రాలేదు. ఇప్పుడు బాలాజీ వీరిద్దరిని కలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి త్రిష వరుసగా సీనియర్ హీరోల సినిమాల్లో నటిస్తూ దూసుకు పోతుంది. దాదాపు అందరు సీనియర్ స్టార్ హీరోలు త్రిషతో వర్క్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నారా అన్నట్లుగా వరుసగా ఈమెకి ఆఫర్లు వస్తున్నాయి. వచ్చే ఏడాది మరిన్ని సీనియర్ హీరోల సినిమాల్లో త్రిషకి ఛాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్రిష జోరు చూస్తూ ఉంటే మరో పదేళ్ల పాటు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా సినిమాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.