Begin typing your search above and press return to search.

విశ్వంభర బ్రేక్ ఇవ్వడం గ్యారెంటీనా..?

సౌత్ స్టార్ హీరోయిన్స్ లో సీనియర్ అయినా కూడా త్రిష ఇప్పటికీ స్టార్ ఛాన్స్ లు అందుకుంటూ అదరగొట్టేస్తుంది.

By:  Tupaki Desk   |   23 Feb 2025 1:01 PM GMT
విశ్వంభర బ్రేక్ ఇవ్వడం గ్యారెంటీనా..?
X

సౌత్ స్టార్ హీరోయిన్స్ లో సీనియర్ అయినా కూడా త్రిష ఇప్పటికీ స్టార్ ఛాన్స్ లు అందుకుంటూ అదరగొట్టేస్తుంది. తమిళంలో రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన త్రిష తెలుగు ఆడియన్స్ కు ఈమధ్య కాస్త దూరమైంది. ఐతే ఆ దూరాన్ని కాస్త దగ్గర చేసేందుకు మళ్లీ మెగా మూవీతో వస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తో విశ్వంభర సినిమాలో ఛాన్స్ పట్టేసింది త్రిష. ఈ సినిమాతో త్రిష ఆఫ్టర్ లాంగ్ టైం టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తుంది.

ఈ సినిమా విజువల్ వండర్ గా ఉండబోతుందని తెలుస్తుంది. వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఐతే విశ్వంభర సినిమాతో త్రిష కు మరోసారి మంచి బ్రేక్ వస్తుందని చెబుతున్నారు. సినిమాలో చిరంజీవి తర్వాత త్రిష పాత్రకు అంత వెయిట్ ఉంటుందని అంటున్నారు. అంతేకాదు సినిమాలో ఆమె సీన్స్ కొన్ని అదిరిపోతాయని టాక్. త్రిష కూడా కొద్దిపాటి గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కాబట్టి పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తుందని తెలుస్తుంది.

అందుకే విశ్వంభర తర్వాత త్రిషకు మళ్లీ టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తాయని అంటున్నారు. బింబిసార తర్వాత వశిష్ట డైరెక్ట్ చేస్తున్న విశ్వంభర సినిమా పై అంచనాలు అయితే తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు.

ఈమధ్య కొంత రొటీన్ కథలతో మెగాస్టార్ సినిమాలు వస్తున్నాయన్న టాక్ ఉంది. అందుకే విశ్వంభర కోసం చిరంజీవి చాలా రిస్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమా దాదాపు ముగింపు దశకు రాగా త్వరలోనే ఒక టీజర్ తో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. చిరంజీవి విశ్వంభర సినిమాలో త్రిష తో పాటు మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్, ఈషా చావ్లా కూడా నటిస్తున్నారని తెలుస్తుంది.

సినిమా కథ ఎంత కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా ఉన్నా మెగా ఫ్యాన్స్ చిరు నుంచి కోరుకునే డ్యాన్స్ యాక్షన్ సీన్స్ అన్ని పుష్కలంగా ప్లాన్ చేస్తున్నాడట వశిష్ట. అందుకే ఈ సినిమా మీద మెగా ఫ్యాన్స్ చాలా హోప్స్ తో ఉన్నారు. చిరంజీవి కూడా వశిష్టకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి మెగా విశ్వంభర సినిమా మరోసారి మెగాస్టార్ స్టామినా ఏంటో బాక్సాఫీస్ దగ్గర చూపిస్తుందా లేదా అన్నది చూడాలి.