సంక్రాంతికి ఆమె ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా..!
సినిమా ఇండస్ట్రీలో త్రిష హీరోయిన్ గా అడుగు పెట్టి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్న విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 12 Sep 2024 5:44 AM GMTసినిమా ఇండస్ట్రీలో త్రిష హీరోయిన్ గా అడుగు పెట్టి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్న విషయం తెల్సిందే. ఏడాది క్రితమే నాలుగు పదుల వయసులో అడుగు పెట్టిన త్రిష జోరు ఏమాత్రం తగ్గలేదు. హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చిన వాళ్లు ఐదు నుంచి పదేళ్లు మాత్రమే ఇండస్ట్రీలో స్టార్స్ గా సినిమాలు చేస్తున్న సమయంలో త్రిష రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ, ఇండస్ట్రీలో మోస్ట్ స్టార్ గా నిలిచింది. ప్రస్తుతం త్రిష చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటిస్తున్న 'విశ్వంభర' ఒకటి అనే విషయం తెల్సిందే.
చిరంజీవి తో గతంలో స్టాలిన్ సినిమాలో నటించిన త్రిష చాలా కాలం తర్వాత ఆయనతో జత కట్టింది. బింబిసార చిత్ర దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి విభిన్నమైన పాత్రలో నటిస్తున్న విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. విశ్వంభర సినిమా ను 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. త్రిష డైరెక్ట్ తెలుగు సినిమా చాలా కాలం తర్వాత రాబోతున్న నేపథ్యంలో ఆమె ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం చాలా ఆసక్తిగా విశ్వంభర సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.
2025 సంక్రాంతికి విశ్వంభర సినిమాతో పాటు అజిత్ హీరోగా నటిస్తున్న 'విదాముయార్చి' చిత్రంతోనూ త్రిష ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ ఏడాదిలోనే విడుదల అవ్వాల్సిన అజిత్, త్రిషల విదాముయార్చి చిత్రం కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది. దాంతో సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ నుంచి ప్రకటన వచ్చింది. రెండు రోజుల గ్యాప్ లో విశ్వంభర, విదాముయార్చి చిత్రాలతో త్రిష బాక్సాఫీస్ వద్దకు రాబోతుంది. తెలుగు లోనూ విదాముయార్చి ని పెద్ద ఎత్తున విడుదల చేయబోతున్నారు. కనుక టాలీవుడ్ లో ఆమె ఫ్యాన్స్ కి సంక్రాంతి సందర్భంగా డబుల్ ధమాకా ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
తెలుగు లో ఒకప్పుడు సీనియర్ స్టార్ హీరోలతో పాటు యంగ్ స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసిన త్రిష గత నాలుగు అయిదు సంవత్సరాలుగా ఎక్కువ తమిళ్ సినిమాలను చేస్తోంది. ఇలాంటి సమయంలో చిరంజీవితో నటించిన విశ్వంభర సినిమా ఆమె ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇవ్వబోతుంది. మరో వైపు అజిత్ తో నటిస్తున్న విదాముయార్చి సినిమాతో కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు త్రిష రాబోతుంది. ముందు ముందు తెలుగు లో త్రిష మరిన్ని సినిమాలు చేయబోతుంది. సీనియర్ స్టార్ హీరోలకు త్రిష మోస్ట్ వాంటెడ్ గా మారుతోంది. తమిళ్ లో విజయ్ కి జోడీగా మరో సినిమాను త్రిష చేయబోతుందనే వార్తలు వచ్చాయి. ఆ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.