Begin typing your search above and press return to search.

వెకేష‌న్ లో త్రిష‌..ఎంత అందంగా అంటే!

తాజాగా అదే సిరీస్ నుంచి మ‌రిన్ని ఫోటోలు వ‌ద‌లింది. అయితే ఈసారి అమ్మ‌డు బ్యూటీ ఎలివేష‌న్ పై ఫోక‌స్ పెట్టింది.

By:  Tupaki Desk   |   20 Oct 2024 8:18 AM GMT
వెకేష‌న్ లో త్రిష‌..ఎంత అందంగా అంటే!
X

అందాల త్రిష మొరాకో వెకేష‌న్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అమ్మ‌డు ఎన్న‌డు లేనంత‌గా ఈసారి వెకేష‌న్ నుంచి ప్ర‌తీ అప్ డేట్ ఎప్ప‌టిక‌ప్పుడు అందిస్తుంది. ఇటీవ‌లే స్లీవ్‌ లెస్‌ టాప్‌ సూట్ ధ‌రించిన ఫోటోలు నెట్టింట వ‌దిలింది. లొకేష‌న్ నుంచి ఓ బుడ‌త‌డి తో దిగిన ఫోటోలు కూడా పంచుకుంది. అందమైన లొకేషన్‌లో తన ప్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి తిరుగుతూ.. రుచికరమైన సంప్రదాయ రుచులను ఆస్వాదించింది. ఇందుకు సంబంధించిన స్టిల్స్ ఇప్ప‌టికే నెట్టింట వైరల్ అయ్యాయి.

తాజాగా అదే సిరీస్ నుంచి మ‌రిన్ని ఫోటోలు వ‌ద‌లింది. అయితే ఈసారి అమ్మ‌డు బ్యూటీ ఎలివేష‌న్ పై ఫోక‌స్ పెట్టింది. ఎలాంటి స్టైలిష్ దుస్తుల్లో కాకుండా సంప్ర‌దాయ దుస్తుల్లో ప‌ద్ద‌తిగా హైలైట్ అయింది. కాళ్ల‌ను మొత్తాన్ని క‌వ‌ర్ చేస్తూ స్క‌ర్ట్ ని ధ‌రించి దానిపై మ్యాచింగ్ బ్లాక్ క‌ల‌ర్ టీష‌ర్ట్ ధ‌రించింది. మ‌రోపిక్ లో పొడ‌వైన దుస్తుల్లో మ‌రింత అందంగా ముస్తాబైంది. అలాగే బ్లూ క‌ల‌ర్ దుస్తుల్లో సైతం అంతే షైనింగ్ అవుతుంది.

చివ‌రిగా జీన్స్ ప్యాంట్ పై కాంబినేష‌న్ రంగు ధ‌రించి చూప‌రుల‌ను ఆక‌ర్షిస్తుంది. అన్నింటిలోనూ కామ‌న్ గా ఓకే ర‌కం హ్యాండ్ బ్యాగ్ భుజాన వేసుకుంది. అలాగే వేడిని తట్టుకునేలా బ్లాక్ గాగూల్స్ ధ‌రించింది. ఇక అమ్మ‌డి మ్యాక‌ప్ అలం కర‌ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ బ్యూటీకి మ్యాక‌ప్ అవ‌స‌రం లేద‌న్న‌ది అభిమానుల అభిప్రాయం. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. త్రిష అందానికి యువ‌త ఫిదా అవుతుంది.

వ‌య‌సుతో పాటు అమ్మ‌డు అందం కూడా రెట్టింపు అవుతుందంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం త్రిష వ‌య‌సు 41. కానీ 30 బ్యూటీలాగే మురిపిస్తోంది. ఇక త్రిష సినిమాల సంగ‌తి చూస్తే.. ప్రస్తుతం విదా ముయార్చి, విశ్వంభర, గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ, రామ్‌, థగ్‌ లైఫ్‌ లాంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టింది త్రిష. వాటిలో కొన్ని షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నాయి.