Begin typing your search above and press return to search.

ఆ ఛాన్స్ కూడా ఎవరికీ ఇవ్వట్లేదు..!

అదేంటో ఈమధ్య కొత్త హీరోయిన్స్ దూకుడు ఎలా ఉందో దానికి మించి సీనియర్ హీరోయిన్స్ సందడి ఉంది.

By:  Tupaki Desk   |   4 Aug 2024 2:30 PM GMT
ఆ ఛాన్స్ కూడా ఎవరికీ ఇవ్వట్లేదు..!
X

అదేంటో ఈమధ్య కొత్త హీరోయిన్స్ దూకుడు ఎలా ఉందో దానికి మించి సీనియర్ హీరోయిన్స్ సందడి ఉంది. రెండు దశాబ్దాల నుంచి కథానాయికగా రాణిస్తున్న వారికి కూడా ఇప్పటికీ వరుస సినిమాలు, అదిరిపోయే ప్రాజెక్ట్ లు వస్తున్నాయి. ఛాన్స్ వచ్చిందే అదును అన్నట్టుగా ముద్దుగుమ్మలు కూడా అదరగొట్టేస్తున్నారు. ఐతే కేవలం సిల్వర్ స్క్రీనే కాదు బుల్లితెర అదే ఓటీటీల్లో కూడా తమ హవా కొనసాగిస్తున్నారు. సీనియర్ హీరోయిన్స్ లో ఇప్పుడు అత్యంత దూకుడు చూపిస్తున్న హీరోయిన్ అంటే మొదటి పేరు త్రిషదే వినిపిస్తుంది.


నీ మనసు నాకు తెలుసు సినిమాతో వెండితెరకు పరిచయమైన త్రిష ఇప్పటికీ ఆ సినిమాలో ఎలా ఉందో అఫ్కోర్స్ ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తుంది. ఏజ్ 40 కి అటు ఇటుగా ఉన్నా గ్లామర్ విషయంలో ఎక్కడ డౌట్ రాకుండా మెయిన్ టైన్ చేస్తుంది త్రిష. తెలుగు, మిగతా భాషల్లో ఏమో కానీ కోలీవుడ్ లో మాత్రం త్రిష ఇప్పటికీ సూపర్ ఫాం కొనసాగిస్తుంది. 96 సినిమా ముందు వరకు త్రిష కెరీర్ కాస్త నత్తనడక నడిచింది. 96 సూపర్ హిట్ అవ్వడంతో ఇక అప్పటి నుంచి వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో దూసుకెళ్తుంది.

ప్రస్తుతం త్రిష కోలీవుడ్ లో విజయ్ గోట్, అజిత్ తో ఒక సినిమా చేస్తుంది. రజిని సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది. మరోపక్క తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలన్నీ త్రిషకు మంచి బూస్టింగ్ ఇచ్చేలా ఉన్నయి. ఇదిలా ఉంటే సిల్వర్ స్క్రీన్ సరిపోదు అన్నట్టుగా ఇప్పుడు అమ్మడు వెబ్ సీరీస్ లతో కూడా సత్తా చాటుతుంది. లేటెస్ట్ గా త్రిష నటించిన బృంద ఓటీటీలో రిలీజైంది. అందులో పోలీస్ ఆఫీసర్ గా కనిపించింది త్రిష.

సినిమాలతోనే కాదు వెబ్ సీరీస్ లతో కూడా తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది అమ్మడు. త్రిష వెబ్ సీరీస్ ఎంట్రీ ఇవ్వడం కూడా మిగతా హీరోయిన్స్ కి షాక్ ఇస్తుంది. అవకాశం ఎక్కడ ఉంటే తను అక్కడ అన్నట్టుగా త్రిష అదరగొట్టేస్తుంది. ఇదే ఫాం కొనసాగిస్తే మరో ఐదేళ్లు కూడా త్రిష తన దూకుడు చూపించేలా ఉంది. 20 ఏళ్లు దాటినా సరే త్రిష ఈ రేంజ్ ఫాం కొనసాగించడం చూసి మిగతా హీరోయిన్స్ అంతా ముక్కున వేలేసుకునేలా చేస్తుంది.