ఓల్డ్ హీరోయిన్లకు రేటు ఎక్కువ గురూ!
ఒక్కో సినిమాకి పదికోట్లు తీసుకునే నయన్ ని ఇప్పుడు 12 కోట్లతో త్రిష వెనక్కి నెట్టింది. ఇప్పటివరకూ సౌత్ లో నెంబర్ హీరోయిన్ ఎవరు? అంటే అంతా నయనతార పేరు చెప్పేవారు.
By: Tupaki Desk | 31 March 2024 8:21 AM GMTహీరోయిన్ల విషయంలో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మరోసారి ప్రూవ్ అయిందా? అంటే అలాగే అనిపిస్తుంది. సీనియర్ భామలకిప్పుడు మార్కెట్ లో గిరాకీ మామూలుగా లేదు. ఫాంలో ఉన్న నాయికల్ని మంచి పారితోషికాలు అందుకుంటోన్న సన్నివేశం కనిపిస్తోంది. ఐటం పాటలో నటించాలన్నా? హీరోయిన్ గా వేషం వేయాలన్నా? వారు డిమాండ్ చేసింనత ఇవ్వాల్సిందే అన్నట్లు తెలుస్తోంది. తమన్నా స్పెషల్ సాంగ్స్ తో పాటు..గెస్ట్ అప్పిరియన్స్ ఇవ్వాలంటే అందులో నటించే హీరోయిన్ మించి డిమాండ్ చేస్తుంది.
'జైలర్' గాను అమ్మడు కోట్లలోనే అందుకుంది. ఇక మరో సీనియర్ అయిన కాజల్ అగర్వాల్ కూడా ఇదే దూకుడులో కనిపిస్తోంది. సీనియర్ హీరోలకు జోడీగా నటించాలంటే తాను ఎంత అడిగితే అంతకు తగ్గేదేలే అంటోంది. ఇక ఇటీవలే త్రిష కమల్ హాసన్ సరసన 'థగ్గ్ లైఫ్' లో నటించేందుకు అక్షరాల 12 కోట్లు అందుకుందని వెలుగులోకి వచ్చింది. ఈ పారితోషికంతో అమ్మడు ఏకంగా లేడీ సూపర్ స్టార్ నయనతారనే బీట్ చేసింది.
ఒక్కో సినిమాకి పదికోట్లు తీసుకునే నయన్ ని ఇప్పుడు 12 కోట్లతో త్రిష వెనక్కి నెట్టింది. ఇప్పటివరకూ సౌత్ లో నెంబర్ హీరోయిన్ ఎవరు? అంటే అంతా నయనతార పేరు చెప్పేవారు. కానీ త్రిష పారితోషికంతో ఇప్పుడా స్థానం మారుతున్నట్లే కళ్ల ముందు కనిపిస్తోంది. థగ్ లైఫ్ తో పాటు అమ్మడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ' విశ్వంభర'లోనూ ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాకి గాను అంతకు ఏమాత్రం తగ్గకుండానే ఛార్జ్ చేస్తుందని సమాచారం.
ఇద్దరు ఒకే తరం హీరోలు కాబట్టి అందుకు ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మలయాళంలో మోహన్ లాల్ సరసన 'రామ్' అనే సినిమాలోనూ నటిస్తోంది. కోలీవుడ్..టాలీవుడ్ రేంజ్ పారితోషికం మాలీవుడ్ లో లేకపోయినా అక్కడ హీరోయిన్లు అందరికంటే అత్యధికంగానే పారితోషికం అందుకుంటుందని చెప్పొచ్చు. అలాగే 'నివీన్ పాలీ'..'ఐడెంటిటీ' అనే సినిమాల్లో కూడా నటిస్తోంది. వాటికి కూడా త్రిష మార్కెట్ ని బట్టే డిమాండ్ చేసే అవకాశం ఉంది. త్రిష పేరుతోనే సినిమా జనాల్లోకి వెళ్తుంది కాబట్టి అక్కడ కూడా ఏ మాత్రం తగ్గదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.