Begin typing your search above and press return to search.

త్రిష వెంటపడుతున్న టాలీవుడ్..!

ఈ 20 ఏళ్ల కాలంలో ఎంతోమంది హీరోయిన్స్ వచ్చారు వెలుగు వెలిగారు ఫేడవుట్ అయ్యి వెళ్లిపోయారు.

By:  Tupaki Desk   |   20 Jan 2024 11:30 PM GMT
త్రిష వెంటపడుతున్న టాలీవుడ్..!
X

రెండు దశాబ్దాలుగా సౌత్ ఆడియన్స్ ని తన మాయలో పడేసిన సౌత్ క్వీన్ అందాల భామ త్రిష కృష్ణన్ ఇప్పటికీ మొదటి సినిమా నీ మనసు నాకు తెలుసు సినిమాలో ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది. ఆ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన లియో వరకు త్రిష సినిమాలో ఉంటే ఆ స్క్రీన్ మీద ఉండే గ్లామరే వేరు అన్నట్టుగా తన సత్తా చాటుతూ వస్తుంది. ఈ 20 ఏళ్ల కాలంలో ఎంతోమంది హీరోయిన్స్ వచ్చారు వెలుగు వెలిగారు ఫేడవుట్ అయ్యి వెళ్లిపోయారు. కానీ త్రిష ఇప్పటికీ అదే ఫాం అదే క్రేజ్ తో కొనసాగుతుంది.

96 ముందు వరకు తమిళ్ లో కూడా కాస్త ఫాం కోల్పోయినట్టు అనిపించిన త్రిష 96 తర్వాత మళ్లీ కెరీర్ లో ఊపందుకుంది. ఆ సినిమా ఇచ్చిన హిట్ జోష్ అమ్మడికి మళ్లీ తిరుగు లేకుండా చేసింది. ఈమధ్య వచ్చిన పి.ఎస్ 1, 2 సినిమాలతో పాటుగా విజయ్ లియో సినిమాలో కూడా త్రిష మెప్పించింది. ఈ సినిమాల్లో త్రిష లుక్స్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశాయి. 20 ఏళ్ల క్రితం యూత్ ఆడియన్స్ ని తన వల్లో వేసుకున్న త్రిష ఇప్పటి యూత్ కి నిద్ర పట్టకుండా చేస్తుందంటే నమ్మాలి.

ఇదిలా ఉంటే కోలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న త్రిషకు ఈమధ్య తెలుగు నుంచి కూడా ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తుంది. అసలైతే ఆచార్య సినిమాలోనే త్రిష హీరోయిన్ గా చేయాల్సి ఉన్నా అది కుదరలేదు. ఇప్పుడు మెగా 156లో త్రిష నటిస్తుందని టాక్. ఇదే కాకుండా బాలకృష్ణ బాబీ కాంబో సినిమాలో కూడా త్రిషని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ రెండు సినిమాలతో టాలీవుడ్ లో సత్తా చాటాలని చూస్తుంది త్రిష.

ఇక లేటెస్ట్ గా త్రిష కోసం ఒక తెలుగు టాప్ ప్రొడక్షన్ హౌస్ ఒక లేడీ ఓరియెంటెడ్ కథ సిద్ధం చేయించారట. త్రిష ఒప్పుకుంటే ఆమెతో భారీ బడ్జెట్ తో ఆ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కథ నచ్చితే ఏ భాషలో అయినా సినిమాలు చేసే త్రిష తెలుగులో ఈ బిగ్ ఆఫర్ కి ఓకే అంటుందో లేదో చూడాలి. ఓ పక్క స్టార్స్ తో నటిస్తూ మరోపక్క ఫిమేల్ సెంట్రిక్ సినిమాల్లో నటించాలని చూస్తున్న త్రిషకు టాలీవుడ్ మరోసారి గ్రాండ్ వెల్కం చెప్పేందుకు రెడీ అవుతుంది.